కోలీవుడ్ ఇండస్ట్రీలో సీరియల్ ఆర్టిస్ట్ గా పలు సీరియల్స్ లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి మహాలక్ష్మి ( Mahalakshmi ) ఒకరు.ఈమె పలు సీరియల్స్ తో పాటు సినిమాలలో కూడా నటించారు.
అయితే ఇటీవల కోలీవుడ్ నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ ( Ravinder Chandra Shekhar ) అనే వ్యక్తిని ఈమె రెండో వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా వీరిద్దరు వివాహం చేసుకున్నారనే విషయం తెలియడంతో వీరి పట్ల భారీ స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి.
రవీందర్ అధిక శరీర బరువు ఉన్నప్పటికీ మహాలక్ష్మి తనని పెళ్లి చేసుకోవడంతో కేవలం డబ్బు కోసమే పెళ్లి చేస్తుందని వీరి మధ్య ఎలాంటి ప్రేమ లేదు అంటూ పెద్ద ఎత్తున వీరిపై ట్రోల్స్ వచ్చాయి.

ఇకపోతే ఈ వార్తలను వీరిద్దరూ ఎప్పటికప్పుడు కొట్టి పారేస్తూ ఉన్నారు.ఇలా ఈ వార్తలను కొట్టి పారేయడమే కాకుండా వారిద్దరు ఎంత అన్యోన్యంగా ఉన్నారనే విషయాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఉన్నారు.ఇకపోతే ఇటీవల మహాలక్ష్మి పుట్టినరోజు( Birthday ) కావడంతో రవీందర్ తనని పెద్ద ఎత్తున సర్ప్రైజ్ చేశారు.
ఇదే విషయాన్ని మహాలక్ష్మి సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు.అర్ధరాత్రి కేక్ తెప్పించి తన భార్య చేత కేక కట్( Cake Cutting ) చేయించు పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు.

ఇందుకు సంబంధించిన ఫోటోలను మహాలక్ష్మి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ పుట్టినరోజు బాగోద్వేగాలతో నిండిపోయింది నా భర్త రాత్రికి కేక్ తీసుకువచ్చి సర్ప్రైజ్ చేశారు.తను నా భర్తగా రావటం నా అదృష్టం.అంతేకాకుండా అమ్మ తమ్ముడు మానసిక వికలాంగుల ఆశ్రమానికి తీసుకువెళ్లి అన్నదానం చేపించారు.ఇది మనసుకు ఎంతగానో హత్తుకుంది.ఇక నాన్న విదేశాల నుంచి ఫోన్ చేసి మరి శుభాకాంక్షలు తెలిపారు.ఇలా ఈ పుట్టినరోజును ఎంతో ప్రత్యేకంగా మార్చినందుకు ధన్యవాదాలు అంటూ ఈమె చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది.