ఐపీఎల్ నుండి అర్ధాంతరంగా తప్పుకున్న భారత స్టార్ స్పిన్నర్..!

రవిచంద్రన్‌ అశ్విన్‌.ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆఫ్‌ స్పిన్నర్‌గా వినిపిస్తున్న పేరు.

 Ravichandran Ashwin Out Of Ipl 2021 To Support Family Infected With Corona , Ipl-TeluguStop.com

అనుకోకుండా క్రికెటరైన అతను స్పిన్నర్‌గా మారి సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు.ఆర్కిటెక్ట్‌ కెరీర్‌ను వదిలిన అతను ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను బుట్టలో వేసుకునే ప్రణాళికలను పక్కాగా రూపొందిస్తున్నాడు.

కేవలం 77 టెస్టుల్లోనే 400 వికెట్లు సాధించి భారత్‌ తరపున అత్యంత వేగంగా ఆ ఘనత అందుకున్న బౌలర్‌గా చరిత్ర తిరగరాశాడు.ప్రపంచ క్రికెట్లో శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ (72 టెస్టులు) తర్వాత అతి తక్కువ టెస్టుల్లో ఆ రికార్డు సాధించిన రెండో బౌలర్‌గా నిలిచాడు.

కెరీర్‌ ప్రమాదంలో పడ్డ దశ నుంచి అద్భుతంగా పుంజుకుని ప్రపంచ క్రికెట్లో సగర్వంగా నిలబడ్డాడు.ప్రస్తుతం 401 వికెట్లతో భారత్‌ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అశ్విన్‌ నాలుగో స్థానంలో ఉన్నాడు.

అనిల్‌ కుంబ్లే (619), కపిల్‌ దేవ్‌ (434), హర్భజన్‌ సింగ్‌ (417) అతని కంటే ముందున్నారు.ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న అతనికి ఇదే జోరులో భజ్జీ, కపిల్‌లను దాటి ముందుకు వెళ్లడం పెద్ద కష్టమేమీ కాదు.

అయితే ఇటువంటి తరుణంలో అశ్విన్ తన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు.ఐపీఎల్ టోర్నీకి బ్రేక్ ఇస్తున్నట్టు అశ్విన్ స్వయంగా ప్రకటించాడు.

తన కుటుంబ సభ్యులకు కరోనా సోకిన నేపథ్యంలో వారికి అండగా నిలిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అశ్విన్ వెల్లడించాడు.

ఈ ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ కేపిటల్స్‌ తరపున ఆడుతున్న అశ్విన్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నాడు.

ఎందుకో తెలీదు చాలా ఒత్తిడికి గురవుతున్నాడు.ఇప్పటిదాకా అయిదు మ్యాచ్‌లను ఆడిన అశ్విన్ అన్నింటికీ కలిపి ఒకే ఒక్క వికెట్ ను పడగొట్టాడు.

దీంతో అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురవుతోంది.అశ్విన్ తన ఫామ్‌ను కోల్పోయాడని చాలా మంది చర్చించుకుంటున్నారు.

చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ వికెట్లను పడగొట్టలేకపోవడంతో అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైంది.కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబానికి అండగా ఉండాలనే ఒకే ఒక్క కారణంతో అశ్విన్ ఐపీఎల్ కు దూరమవ్వాలనే నిర్ణయం తీసుకున్నాడు.

చెన్నై సహా తమిళనాడు వ్యాప్తంగా వేల సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి.దీంతో తమిళనాడు ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించింది.

ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబంతో గడపాలనే కారణంతో అశ్విన్ ఐపీఎల్ 2021 సీజన్ నుంచి తప్పుకొన్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube