ఆ అవార్డు రేసులో రవిచంద్రన్ అశ్విన్.. విజేతగా నిలిస్తే..!

టీమ్ ఇండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 35 ఏళ్ల వయసులో కూడా తన అద్భుతమైన ఆట ప్రదర్శనతో అందరి ప్రశంసలు దక్కించుకుంటున్నారు.అశ్విన్ ఈ ఏడాదిలో ఆస్ట్రేలియా టూర్‌లో జరిగిన సిడ్నీ టెస్టులో వెన్ను నొప్పిని కూడా భరించి ఆడాడు.

 Ravichandran Ashwin In That Award Race Award Race, Ravichendra Aswin, Sports Up-TeluguStop.com

అతడి అంకితభావానికి ఫలితం కూడా దక్కింది.ఈ టెస్టులో హనుమ విహారితో కలిసి ఏడో వికెట్ కు 65 పరుగులు జోడించి ఇండియాను ఓటమి నుంచి గట్టెక్కించాడు రవిచంద్రన్ అశ్విన్.

అంతకుముందు రోజులో 14 ఓవర్లు వేసి జట్టుకు సపోర్ట్ గా నిలిచాడు.

అటు బ్యాటుతో ఇటు బంతితో అశ్విన్ అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చి ఈ ఏడాది టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.2021లో అతడు మొత్తం 8 టెస్ట్ మ్యాచ్‌లలో 52 వికెట్లు తీసి.337 పరుగులు చేశాడు.దీనితో అతడి అద్భుతమైన ఆట ప్రదర్శనను ఐసీసీ గుర్తించింది.2021లో టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా అశ్విన్‌ను ఐసీసీ నామినేట్ చేసింది.ఈ రేసులో అశ్విన్‌తో పాటు ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్‌, న్యూజిలాండ్ బౌలర్ జేమీసన్‌, శ్రీలంక టెస్ట్ కెప్టెన్ దిముత్‌ కరుణరత్నె ఉన్నారు.ఈ అవార్డు విజేతను జనవరి 24న ఐసీసీ ప్రకటించనుంది.

ఒకవేళ ఇందులో రవిచంద్రన్ అశ్విన్ విజేతగా నిలిస్తే అతని పేరు మార్మోగిపోతుంది.

Telugu Award Race, Awards, Icc Palyer, Sport, India-Latest News - Telugu

రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటివరకు టెస్ట్ మ్యాచ్‌లలో మొత్తంగా 400 వికెట్లు తీశాడు.2021 ఏడాదిలో భీకరమైన ఫామ్ తో మేటి స్పిన్నర్లలో ఒకడిగా రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు.ఈ విషయాన్ని తాజాగా ఐసీసీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

భారత జట్టుకు విజయాలు అందించిన గొప్ప ప్లేయర్లలో అశ్విన్ ఒకరు.ఆల్ రౌండర్ గా రాణించి జట్టుకు వెన్నెముకగా నిలిచారు.

ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డుకు సెలెక్ట్ చేయడానికి అతనికి అన్ని అర్హతలు ఉన్నాయి” అని ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది.ఈ రేస్ లో ఉన్న మిగతా ఆటగాళ్లు కూడా మేటి ప్రదర్శన కనబర్చారు.

మరి ఈ ఏడాది టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఎవరిని వరిస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube