బర్త్ డే కానుకగా మాస్ రాజా 'రావణాసుర' నుండి అదిరిపోయే అప్డేట్!

మాస్ మహారాజా రవితేజ ప్రెజెంట్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు.వరుసగా రెండు బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి కెరీర్ లోనే మంచి ఫామ్ లో ఉన్నాడు.

 Ravi Teja Ravanasura First Glimpse To Be Out On His Birthday Details, Ravanasura-TeluguStop.com

ముందు గత డిసెంబర్ లో ధమాకా సినిమాతో వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమా మాస్ రాజా కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.

ఈ సినిమా విజయాన్ని రవితేజ ఎంజాయ్ చేస్తున్న తరుణంలోనే మరో హిట్ అందుకున్నాడు.

తాజాగా సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి రవితేజ నటించిన మల్టీ స్టారర్ సినిమా వాల్తేరు వీరయ్య రిలీజ్ అయ్యింది.

ఈ సినిమాను బాబీ డైరెక్ట్ చేయగా పండుగ కానుకగా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.ఈ సినిమాతో కూడా హిట్ అందుకున్న రవితేజ ఇక తన లైనప్ లో ఉన్న సినిమాల షూటింగులను పూర్తి చేస్తున్నాడు.

ప్రెజెంట్ రవితేజ లైనప్ లో ఉన్న చిత్రాల్లో ముందుగా రిలీజ్ కాబోతున్న సినిమా ”రావణాసుర”. ఈ సినిమాను సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు.ఈ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.మరి అతి త్వరలోనే రవితేజ పుట్టినరోజు రాబోతున్న నేపథ్యంలో ఆ రోజు ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇవ్వబోతున్నారు మేకర్స్.

జనవరి 26న రవితేజ పుట్టిన రోజు అనే విషయం తెలిసిందే.మరి ఆ రోజు ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వనున్నారు.

మరో నాలుగు రోజుల్లోనే రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుండి గ్లిమ్స్ రాబోతుంది అని తాజాగా కొద్దీ సేపటి క్రితం ప్రకటించారు మేకర్స్.ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో మాస్ రాజాకు జోడీగా అను ఇమ్మాన్యుయేల్, పూజిత పొన్నాడ, దక్షా నాగర్కర్, ఫరియా అబ్దుల్లా, మేఘ ఆకాష్ లు నటిస్తుండగా అభిషేక్ పిక్చర్స్, ఆర్టి టీమ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఇక అక్కినేని హీరో సుశాంత్ ఈ సినిమాలో విలన్ రోల్ లో నటిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube