రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' వాయిదా.. కారణం ఇదేనట!

మాస్ రాజా రవితేజ స్పీడ్ ను మిగతా హీరోలు అందుకోవడం చాలా కష్టం.ఎందుకంటే రవితేజ ఏడాదికి నాలుగు సినిమాలు చేస్తూ జెట్ స్పీడ్ గా దూసుకు వెళ్తాడు.

 Ravi Teja's 'ramarao On Duty' Release Postponed, Ravi Teja, Ramarao On Duty, Pos-TeluguStop.com

రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఖిలాడీ‘ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యింది.కానీ ఈయనకు ఆశించిన విజయం అందించలేక పోయింది.

ఇక ప్లాప్ ను వదిలేసి వెంటనే మరో సినిమా స్టార్ట్ చేసేసాడు.

ఈ సినిమా తర్వాత రవితేజ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మరొక సినిమా చేయబోతున్నాడు.

రవితేజ కెరీర్ లో ఇది 68వ సినిమాగా తెరకెక్కబోతుంది.దీంతో పాటు శరత్ మండవ దర్శకత్వంలో ‘రామారావు ఆన్ డ్యూటీ‘ సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకు వెళ్ళాడు.

ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది.ఈ సినిమాను జూన్ 17న గ్రాండ్ గా రిలీజ్ చేయాలనీ భావించారు.

కానీ ఈ సినిమా మరోసారి వాయిదా వేసి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు మేకర్స్.ఈ రోజు ఈ సినిమాను పోస్ట్ పోన్ చేస్తున్నట్టు అఫిషియల్ గా ప్రకటించారు మేకర్స్.

అందుకు కారణం కూడా తెలిపారు.రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం అవ్వడం వల్లనే ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్టు తెలిపారు.

త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామని నిర్మాతలు ప్రకటించారు.అసలు ఈ సినిమా మార్చి 25న కానీ ఏప్రిల్ 25న కానీ రిలీజ్ అవ్వాల్సి ఉండగా పెద్ద సినిమాల వల్ల ఈ సినిమాను వాయిదా వేసి జూన్ 17న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.ఇక ఇప్పుడు ఈ రిలీజ్ డేట్ కూడా మార్చేశారు.మరి కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారో వేచి చూడాలి.ఇక ఈ సినిమాలో రవితేజ కు జోడీగా రజిషా విజయన్, దివ్యంసా కౌశిక్ నటిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube