రవితేజ వారసుడి ఎంట్రీకి అంతా సిద్ధం.. ఫస్ట్ లుక్ వచ్చేసింది..

సినీ ఇండస్ట్రీ అన్నాక వారసులు రావడం సహజమే.మన తెలుగు ఇండస్ట్రీలో ఇలా వచ్చిన వారసులు చాలా మంది ఉన్నారు.

 Ravi Teja's Nephew Debuts As Hero In Ay Pilla Movie, Ravi Teja's Nephew, Debut M-TeluguStop.com

మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ.ఇలా ఈ ఫ్యామిలీల నుండి ఎంతో మంది వారసులు వచ్చారు.

ఇంకా వస్తూనే ఉన్నారు.అయితే మొదటిసారి రవితేజ ఫ్యామిలీ నుండి కూడా మరో హీరో రాబోతున్నాడు.

రవితేజ వారసుడు వెండితెర మీద హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు ఇంకా సమయం ఉంది.ఈ లోపులోనే ఈయన ఫ్యామిలీ నుండి రవితేజ మేనల్లుడు మాధవ్ భూపతిరాజు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.

మేనమామ ఆశీర్వాదంతో మాధవ్ రాబోతున్నాడు.ఈ మేరకు ఈ రోజు ఆయన ఎంట్రీ ఇవ్వబోతున్న సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు.

‘ఏయ్ పిల్లా’ అనే సినిమాతో మాధవ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.లుదీర్ బైరెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా.ప్రముఖ డైరెక్టర్ రమేష్ వర్మ కథ అందించారు.లవ్ అండ్ రొమాంటిక్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఈ రోజు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.

ఈ ఫస్ట్ లుక్ ఆసక్తికరంగా ఉండడంతో ప్రేక్షకులను ఆకట్టు కుంటుంది.

Telugu Ay Pilla, Debut-Movie

రవితేజ మేనల్లుడు కూడా రవితేజ పోలికలతో ఉండడంతో ఈ సినిమాకు బజ్ బాగానే క్రియేట్ అయ్యింది.ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాధవ్ కూడా రవితేజ లాగా మంచి హీరో అవ్వడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.మరి ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

ఇక ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా.హీరోయిన్ గా మిస్ ఇండియా రన్నర్ రుబల్ షెకావత్ నటిస్తుంది.

రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటించనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube