నెలన్నర గ్యాప్ లోనే రెండు సినిమాలు.. కరోనా లోటు మాస్ రాజా ఇలా భర్తీ

Ravi Teja Two Movies Khiladi And Rama Rao On Duty Movies Releasing Back To Back

రవితేజ కరోనా టైమ్ లో క్రాక్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ ఏడాది సంక్రాంతికి ముందు ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

 Ravi Teja Two Movies Khiladi And Rama Rao On Duty Movies Releasing Back To Back-TeluguStop.com

కరోనా సమయంలో వచ్చిన అతి కొద్ది సినిమాల్లో చాలా తక్కువ సినిమాలు సక్సెస్ అయ్యాయి.అందులో క్రాక్ సినిమా ఒకటి అనడంలో సందేహం లేదు.

ఇక కరోనా టైమ్‌ లో గ్యాప్ రావడంతో బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలను రాబోయే రోజుల్లో విడుదల చేసేందుకు చాలా మంది హీరోలు ప్రయత్నాలు చేస్తున్నారు.అందులో భాగంగా రవితేజ కూడా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

 Ravi Teja Two Movies Khiladi And Rama Rao On Duty Movies Releasing Back To Back-నెలన్నర గ్యాప్ లోనే రెండు సినిమాలు.. కరోనా లోటు మాస్ రాజా ఇలా భర్తీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రవితేజ కరోనా టైమ్‌ లో సినిమా తో వచ్చిన వరుసగా నాలుగు సినిమాలను వచ్చే ఏడాదిలో విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నాడు.ఖిలాడి సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయబోతున్నారు.

రమేష్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఖిలాడి సినిమా పై చాలా అంచనాలున్నాయి.ఖిలాడి సినిమా తర్వాత రవితేజ చేస్తున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ.ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.శరత్ మండవ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ను మార్చి 25న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

దాంతో నెలన్నర గ్యాప్లోనే రవితేజ రెండు సినిమాలు రాబోతున్నాయని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రెండు మాత్రమే కాకుండా ధమాకా మరియు టైగర్ నాగేశ్వరరావు సినిమాలు కూడా రవితేజ చేస్తున్నాడు.ఆ రెండు సినిమాలు ఎప్పుడు వస్తాయో చూడాలి. రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాల పరంపర చూస్తుంటే ఆయన నాలుగు అయిదు ఏళ్ల క్రితం చూపించిన జోరు గుర్తుకు వస్తుంది.

అప్పట్లో ఆయన ఏడాదికి నాలుగు అయిదు సినిమాలు విడుదల చేసేవాడు.ఆ సినిమాల్లో రెండు మూడు సినిమాలు సూపర్‌ హిట్‌ అయ్యేవి.ఇప్పుడు 2022 కూడా అదే పరిస్థితి అంటూ వార్తలు వస్తున్నాయి.

#Rama Rao Duty #Ravi Teja #Khiladi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube