డిస్కోరాజాకు అదే పెద్ద మైనస్‌ అయ్యిందా?

రవితేజ హీరోగా విఐ ఆనంద్‌ దర్శకత్వంలో రూపొందిన డిస్కోరాజా చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ చిత్రంకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తుంది.

 Ravi Teja Sunil Payal-TeluguStop.com

ఇప్పటికే మంచి వసూళ్లను కూడా నమోదు చేసింది.మరో రెండు మూడు రోజుల్లో కొన్ని ఏరియాల్లో బ్రేక్‌ ఈవెన్‌కు కూడా సాధ్యం కాబోతున్నట్లుగా ట్రేడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియాలో మరియు వెబ్‌ మీడియాలో ఈ చిత్రంలో సునీల్‌ పాత్ర గురించి జోకులు పేలుతున్నాయి.

కమెడియన్‌గా మరియు విలన్‌గా సునీల్‌ ఈ చిత్రంలో కనిపించాడు.

అయితే కమెడియన్‌గా నవ్వించలేక పోయిన సునీల్‌ విలన్‌గా మాత్రం నవ్వించాడు అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ వస్తున్నాయి.విలన్‌గా సునీల్‌ ఏంట్రా బాబోయ్‌ అనుకుంటూ కొందరు కామెంట్స్‌ చేస్తూ ఉంటే సునీల్‌ను ఫుల్‌లెంగ్త్‌ విలన్‌ పాత్రలో చూపించి ఉంటే బాగా నవ్వుకుని ఉండేవాళ్లం కదా అంటూ మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

మొత్తానికి సునీల్‌ విషయమై మిస్‌ ఫైర్‌ అయ్యిందనిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube