ఫస్ట్ లవ్ డీటెయిల్స్ చెప్పిన రవితేజ..!!

దాదాపు కొన్ని సంవత్సరాల పాటు వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రవితేజ తాజాగా క్రాక్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.ఈ సినిమా విజయంతో రవితేజ అభిమానులు కూడా హ్యాపీగా ఉన్నారు.

 Ravi Teja Reveals First Love First Remuneration Details, Ravi Teja,krack,lock Do-TeluguStop.com

ముఖ్యంగా లాక్‌డౌన్‌ తర్వాత థియేటర్ లో ఓపెన్ అయినాక.ప్రజల నుండి రక్తం ఎలా వస్తుంది అన్న దాని విషయంలో కంగారు పడుతున్న ఇండస్ట్రీకి చెందిన వాళ్లు ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూసి ఊపిరి పీల్చుకుంటున్నారు.

అంతేకాకుండా లాక్‌డౌన్‌ తర్వాత సినిమా థియేటర్ లు ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ “క్రాక్” సినిమాతో ఇండస్ట్రీలో రవితేజ కొట్టాడు.కాగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో రవితేజ పలు చానళ్లకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

ఈ క్రమంలో ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో మీ ఫస్ట్ లవ్.ఏ వయసులో ఎవరితో అని యాంకర్ రవి తేజ అని ప్రశ్నించటం జరిగింది.

యాంకర్ వేసిన ప్రశ్నకు రవితేజ సమాధానమిస్తూ ఏడవ తరగతిలో అని చెప్పాడు.

అప్పటిదాకా సినిమాలు చూడటానికి స్కూల్ మానేయటం జరిగేదని.

కానీ అమ్మాయిని చూశాక, ఆ  అమ్మాయి కోసమే అన్నట్టు స్కూల్ కి వెళ్లడం జరిగేదని పేర్కొన్నారు.దాన్ని లవ్ అంటారో, క్రష్  అంటారో తెలియదని రవితేజ చెప్పుకొచ్చాడు.

కాగా “క్రాక్” సినిమా సూపర్ డూపర్ హిట్ కావడం పట్ల సంతోషాన్ని కూడా వ్యక్తం చేశారు.ఇదే తరుణంలో ఇండస్ట్రీలో ఫస్ట్ రెమ్యూనరేషన్ నాగార్జున నటించిన “నిన్నే పెళ్ళాడతా” సినిమా కి 3500/- చెక్.

నాగార్జున చేతుల మీదగా  తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు.ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసినట్లు.

, చాలా కాలం ఆ చెక్ దాచినట్లు.రవితేజ పేర్కొన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube