ఆ ప్రొడ్యూసర్ ను ఆదుకోబోతున్న మాస్ రాజా.. మరో మూవీ చేస్తాడట!

ఏ ఇండస్ట్రీ లో అయినా బ్లాక్ బస్టర్ హిట్స్ ఎలా ఉంటాయో.ప్లాప్స్ కూడా అలానే ఉంటాయి.

 Ravi Teja Ramarao On Duty Producer, Ravi Teja, Ramarao On Duty, Sharat Mandava,-TeluguStop.com

చిన్న చిన్న లాస్ అంటే ప్రొడ్యూసర్స్ భరిస్తారు.కానీ హ్యుజ్ లాస్ వచ్చినప్పుడు నిర్మాత కూడా నిండా మునిగి పోతాడు.

అలా ఉన్నప్పుడు ఆ నిర్మాతలను ఆదుకోవడానికి హీరోలు తమ పారితోషికం వెనక్కి ఇచ్చేస్తూ ఉంటారు.ఇలా ఇప్పటి వరకు చాలా మంది హీరోలు తమ సినిమాల లాస్ వల్ల నిర్మాత నష్టపోతే తాము కూడా తమవంతు సహాయంగా ఇలా చేసారు.

ఇటీవలే ఆచార్య సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది.ఈ సినిమాలో ఇద్దరు మెగా హీరోలు నటించిన దాదాపు 50 కోట్లకు పైగానే లాస్ వచ్చినట్టు వార్తలు వచ్చాయి.

ఆ నష్టాలను కొంతమేర అయినా పూడ్చడానికి చరణ్ పారితోషికాలను తిరిగి ఇచ్చేశారని టాక్.ఇక ఇప్పుడు రవితేజ కూడా ఇలాంటి భారీ నష్టాన్ని చూసాడు.రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’.

Telugu Ramarao Duty, Ravi Teja, Raviteja, Sharat Mandava-Movie

ఈ సినిమా జులై 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.పలు వాయిదాల తర్వాత రిలీజ్ అయినా ఈ సినిమా నెగిటివ్ టాక్ వచ్చింది.ఖిలాడీ తర్వాత రవితేజ నుండి వచ్చిన సినిమా కావడంతో ముందు నుండి ఈ సినిమాపై అంచనాలు పెద్దగా లేవు.

అనుకున్నట్టుగానే ఈ సినిమా బిగ్గెస్ట్ ప్లాప్ అని తేల్చేసారు.దీంతో రవితేజ పారితోషికం వెనక్కి ఇచ్చేసాడు అంటూ వార్తలు వచ్చాయి.

కానీ ఇందులో నిజం లేదట.ఈయన పారితోషికం అయితే ఇవ్వలేదు కానీ మరో సినిమా చేసిపెడతా అని నిర్మాతకు హామీ ఇచ్చాడట.అదే పారితోషికంతో నిర్మాత చెరుకూరి సుధాకర్ కు మరో సినిమా చేస్తానని కమిట్ మెంట్ ఇచ్చాడట.30 రోజుల్లో ప్రేమించడం ఎలా.సినిమా ఫేమ్ మున్నాతో వీరి కాంబోలో సినిమా రాబోతుంది అంటూ తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube