30 రోజులకు 8 కోట్లు తీసుకుంటున్న రవితేజ..?

మాస్ మహారాజ రవితేజ క్రాక్ సినిమాతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చిన విషయం తెలిసిందే.చాలా రోజులుగా వరస ప్లాపులతో సతమతమవుతున్న రవితేజ ఎట్టకేలకు సంక్రాంతికి రిలీజ్ అయిన క్రాక్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.

 Ravi Teja New Movie With Director Sarath Mandava Remuneration Details-TeluguStop.com

రాజా ది గ్రేట్ సినిమా తర్వాత మళ్ళీ వరస ప్లాపులతో ఉన్న రవితేజకు క్రాక్ సినిమా హిట్ అవ్వడం ఆయనలో జోష్ ను నింపింది.

కలెక్షన్ల పరంగా కూడా క్రాక్ సినిమా రికార్డు స్థాయిలో కుమ్మేసింది.కరోనా కారణంగా 50 శాతం ఆక్యుపెన్సీతోనే రిలీజ్ అయ్యినా.20 కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చింది.ఈ సినిమాలో రవితేజకు జోడీగా శృతి హాసన్ నటించింది.అదే జోష్ లో రవితేజ వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

 Ravi Teja New Movie With Director Sarath Mandava Remuneration Details-30 రోజులకు 8 కోట్లు తీసుకుంటున్న రవితేజ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu 30 Days Dates, 8 Crores Remuneration, Divyansha Kaushik, Khiladi, Krack, Ravi Teja, Ravi Teja Latest Movie, Ravi Teja New Movie Remuneration, Raviteja Remuneration, Remuneration, Sarath Mandava-Movie

ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే ఉగాది రోజు మరొక సినిమా ప్రారంభించాడు.ఈ సినిమా శరత్ మండవ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.ఇది వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న యాక్షన్ త్రిల్లర్.ఎస్.ఎల్.వి సినిమా పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.అయితే ఈ సినిమాకు రవితేజ కొన్ని కండీషన్స్ పెట్టినట్టు తెలుస్తుంది.

రవితేజ ఈ సినిమాకు కేవలం 30 రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చినట్టు ఈ డేట్స్ లోనే సినిమా పూర్తి చేయాలనీ డైరెక్టర్ కు కండీషన్ పెట్టాడట.

అంతేకాదు 30 రోజులకు రవితేజ 8 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నాడని టాక్ నడుస్తుంది.అంతే కాకుండా వైజాగ్- నైజాం ఏరియా రైట్స్ లో 50 శాతం వాటా కూడా తీసుకోబోతున్నాడట.

ఈ సినిమాలో రవితేజకు జోడీగా దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటించబోతుంది.

#Ravi Teja #Sarath Mandava #RaviTeja #8Crores #Khiladi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు