రవితేజ మళ్లీ మునుపటి తప్పే చేస్తున్నాడంటూ అభిమానుల టెన్షన్‌

మాస్ మహారాజా రవితేజ ఈతరం హీరోల్లో అత్యధిక సినిమాల్లో నటించిన ఘనత దక్కించుకున్నాడు అనడంలో సందేహం లేదు.ఎందుకంటే ఆయన గతంలో ఏడాదికి అయిదు ఆరు సినిమాలు చేసిన ఘనత కూడా దక్కించుకున్నాడు.

 Ravi Teja New Film Only One Month-TeluguStop.com

తెలుగు యంగ్‌ స్టార్‌ హీరోలకు పోటీగా రవితేజ ఇప్పటికి కూడా వరుసగా సినిమాలు చేస్తున్నాడు.ఆమద్య వరుసగా అయిదు ఆరు ప్లాప్ లు పడటం వల్ల రవితేజ ఢీలా పడిపోయాడు.

రాజా ది గ్రేట్‌ తర్వాత క్రాక్‌ సినిమా తో మళ్లీ సక్సెస్ ను రవితేజ దక్కించుకున్నాడు.ఎట్టకేలకు రవితేజకు దక్కిన సక్సెస్‌ తో ఆయన మళ్లీ మునుపటి జోరును కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

 Ravi Teja New Film Only One Month-రవితేజ మళ్లీ మునుపటి తప్పే చేస్తున్నాడంటూ అభిమానుల టెన్షన్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రవితేజ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు చూస్తుంటే మళ్లీ మునుపటి రోజులు వచ్చాయి అంటున్నారు.ఇది ఆయన అభిమానులకు కాస్త టెన్షన్ కు గురి చేస్తున్నాయి.

రవితేజ గతంలో కథ విషయంలో పెద్దగా పట్టింపు లేకుండా దర్శకుడి గురించి ఆలోచించకుండా సినిమాలకు కమిట్‌ అయ్యేవాడు.ఇప్పుడు కూడా అదే తరహాలో వరుసగా మళ్లీ సినిమాలు చేస్తున్నాడేమో అనిపిస్తుంది.

గడచిన రెండు మూడేళ్లుగా రవితేజ సినిమాల ఎంపిక విషయంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటు వచ్చాడు.కాని ఇప్పుడు మాత్రం కథ మరియు దర్శకుడి విషయంలో మళ్లీ పట్టింపు లేనట్లుగా ఆయన ప్రవర్తిస్తున్నాడేమో అనిపిస్తుందని అంటున్నారు.

రవితేజ నెల రెండు నెలల గ్యాప్‌ లోనే సినిమాలను చేసేందుకు సిద్దం అయ్యాడు.తాజాగా రవితేజ హీరోగా శరత్‌ అనే దర్శకుడితో సినిమా ప్రారంభం అయ్యింది.ఆ సినిమా షూటింగ్‌ కూడా ఇటీవల మొదలు అయ్యింది.ఇలాంటి సమయంలో రవితేజ నటిస్తున్న ఈ సినిమా ను కేవలం నెల రోజుల గ్యాప్‌ లోనే పూర్తి చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

నెల రోజుల్లో సినిమా ఎలా బాసూ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.కాని రవితేజ మాత్రం త్వరగా పూర్తి చేసి అవతల పారేయాలని ఆశ పడుతున్నాడట.

ఇది అభిమానులకు ఆందోళన కలిగిస్తున్నాడు.

#Raviteja #RaviTeja #Krack

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు