ఇది వర్కౌట్‌ కాకుంటే సగానికి పడిపోనుంది

మాస్‌ మహారాజా రవితేజ కుటుంబ కారణాలు మరియు ఇతరత్ర కారణాల వల్ల రెండు సంవత్సరాలు గ్యాప్‌ తీసుకుని ‘రాజా ది గ్రేట్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

 Ravi Teja Nela Ticket Movie-TeluguStop.com

అంతకు ముందు రెండు సంవత్సరాలు కూడా రవితేజకు సక్సెస్‌ అనేది లేదు.అంటే నాలుగు సంవత్సరాల తర్వాత రవితేజ నుండి రాజా ది గ్రేట్‌ రూపంలో ఒక సక్సెస్‌ వచ్చిందన్నమాట.

ఆ సక్సెస్‌ మూడు నాళ్ల ముచ్చటగానే మిగిలి పోయింది.ఆ వెంటనే వచ్చిన ‘టచ్‌ చేసి చూడు’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడటం జరిగింది.

ఇక ప్రస్తుతం రవితేజ నటిస్తున్న చిత్రం ‘నేల టికెట్‌’.

వరుసగా రెండు విజయాలను దక్కించుకున్న కళ్యాణ్‌ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.రవితేజ బాడీ లాంగ్వేజ్‌కు మరియు ఆయన స్టైల్‌కు తగ్గట్లుగా సినిమాను డిజైన్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి అయ్యి విడుదలకు సిద్దం అవుతుంది.

ఈ సినిమా సక్సెస్‌ అయితేనే రవితేజ కెరీర్‌ ఇదే జోరుతో ముందుకు వెళ్తుంది.లేదంటే ఆయన చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రవితేజ ‘నేల టికెట్‌’ కోసం ఏకంగా 8 కోట్ల పారితోషికం తీసుకున్నట్లుగా సమాచారం అందుతుంది.ఒక వేళ నేల టికెట్‌ చిత్రం ఫ్లాప్‌ అయితే ఆయన పారితోషికం 4 లేదా అంతకంటే తక్కువ పారితోషికంకు పడిపోయి అవకాశం ఉంది.

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ‘నేల టికెట్‌’ చిత్రం ఆడియోను పవన్‌ చేతుల మీదుగా ఆవిష్కరింపజేయడంతో అంచనాలు భారీగా పెరిగాయి.అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించాను అంటూ చెబుతున్నాడు.

కాని ఏ సినిమాను స్టార్‌ హీరోలు చేసినా కూడా ముందుగా భారీ క్రేజ్‌ రావడం జరుగుతుంది.తీరా సినిమా విడుదలైన తర్వాత మాత్రం అందులో మ్యాటర్‌ ఉండటం లేదు.

తాజాగా విడుదలైన నా పేరు సూర్య చిత్రం విడుదలకు ముందు భారీ క్రేజ్‌ను సంపాదించింది.కాని సినిమాలో మాత్రం మ్యాటర్‌ లేకపోవడంతో అంతా కూడా నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

‘నేల టికెట్‌’ చిత్రాన్ని ఈనెల 25న విడుదల చేయబోతున్నారు.కేవలం మూడు నెలల్లో పూర్తి చేసిన ఈ సినిమాపై ప్రస్తుతానికి అంచనాలు బాగానే ఉన్నాయి.

కాని విడుదలైతే కాని పరిస్థితి ఏంటీ అనేది తెలియదు.ఈ చిత్రం తర్వాత రవితేజ చేస్తున్న సినిమాకు శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నాడు.

ఆ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు.కనుక ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్‌ అయితే తప్ప రవితేజ కెరీర్‌ సాఫీగా సాగుతుంది.

ఒక వేళ నేల టికెట్‌ ఫ్లాప్‌ అయితే రవితేజ పారితోషికం సగానికి పైగా తగ్గే అవకాశాలున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube