జైలుకి వెళ్లిన టాలీవుడ్ స్టార్ హీరో... అందుకేనా....  

Ravi Teja Krack Movie Shooting Started In Rajamndry Central Jail - Telugu Krack Movie Shooting Update, Ravi Teja Krack Movie News,, Ravi Teja Krack Movie Shooting Update, Ravi Teja Movie Shooting Update, Tollywood Hero Raviteja, Tollywood Hero Raviteja Movie News

ప్రస్తుతం టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న “క్రాక్” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో రవితేజ సరసన సీనియర్ విలక్షణ నటుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ నటిస్తోంది.

 Ravi Teja Krack Movie Shooting Started In Rajamndry Central Jail

అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ కూడా విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందింది.అంతేకాక ఈ ట్రైలర్ చూసిన రవితేజ అభిమానులు ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అయితే తాజాగా ఈ చిత్ర షూటింగ్ నిమిత్తమై రాజమండ్రి సెంట్రల్ జైల్ పరిసర ప్రాంతంలో చిత్ర యూనిట్ సభ్యులు హల్చల్ చేస్తున్నట్లు సమాచారం.అయితే ఈ చిత్రంలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.

జైలుకి వెళ్లిన టాలీవుడ్ స్టార్ హీరో… అందుకేనా….-Latest News-Telugu Tollywood Photo Image

గతంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన టువంటి బలుపు, విక్రమార్కుడు, టచ్ చేసి చూడు, వంటి చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.దీంతో మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించేందుకు రవితేజ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి దాదాపుగా 80 శాతం చిత్రీకరణ పూర్తయింది.దీంతో ప్రస్తుతం క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించేందుకు దర్శకుడు గోపీచంద్ మలినేని ఇప్పటికే భారీ సెట్ ని కూడా నిర్మించినట్లు తెలుస్తోంది.అయితే వరుస పరాజయాలతో బాధపడుతున్నటువంటి రవితేజకి ఈ చిత్రం కొంత ఊరట కలిగించే ఈ విధంగా ఉన్నట్లు కనబడుతోంది.

అయితే ఇటీవల కాలంలో రవితేజ నటించినటువంటి “డిస్కో రాజా” చిత్రం మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ సరైన వసూళ్లు మాత్రం రాబట్టలేకపోయింది.

దీంతో కొంతమేర దర్శక నిర్మాతలు నష్టాలను చవిచూసిన ట్లు తెలుస్తోంది.మరి గోపీచంద్ మలినేని అయినా ఈ క్రాక్ తో రవితేజకి హిట్ కొట్టిస్తాడో లేదో చూడాలి.

అయితే ఈ చిత్రాన్ని ఏసవిలో విడుదల చేసేందుకు దర్శకుడు గోపీచంద్ మలినేని సన్నాహాలు చేస్తున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ravi Teja Krack Movie Shooting Started In Rajamndry Central Jail Related Telugu News,Photos/Pics,Images..

footer-test