2021కి క్రాక్‌ శుభారంభం, 5 రోజుల్లోనే బ్రేక్‌ ఈవెన్‌

టాలీవుడ్ కు మాత్రమే కాకుండా యావత్‌ దేశానికి అన్ని భాషల సినిమా పరిశ్రమలకు కూడా 2020 సంవత్సరం చేదు అనుభవంను మిగిల్చింది అనడంలో సందేహం లేదు.ప్రతి రంగంలో కూడా ఏడాది ఆరంభం బాగుంటే ముందు ముందు అంతా బాగుంటుందని అంతా అనుకుంటూ ఉంటారు.

 Ravi Teja Krack Movie Collections-TeluguStop.com

గత ఏడాది టాలీవుడ్‌ కు ఆరంభం బాగానే ఉన్నా కూడా ఆ తర్వాత మాత్రం మొత్తం తల కిందులు అయ్యింది.కాని ఈసారి మాత్రం అలా జరగదు అని అంతా నమ్మకంగా ఉన్నారు.

ఖచ్చితంగా టాలీవుడ్ తో పాటు అన్ని రంగాలకు ఈ ఏడాది బాగా ఉంటుందని అంటున్నారు.ఇతర రంగాల పరిస్థితి ఏమో కాని ఈ ఏడాది టాలీవుడ్‌ లో మొదటగా క్రాక్‌ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 Ravi Teja Krack Movie Collections-2021కి క్రాక్‌ శుభారంభం, 5 రోజుల్లోనే బ్రేక్‌ ఈవెన్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుని 2021 కి శుభారంభంను ఇచ్చింది.

రవితేజ హీరోగా శృతి హాసన్‌ హీరోయిన్‌ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన క్రాక్‌ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది.

రికార్డు బ్రేకింగ్ వసూళ్లను సాధించిన ఈ సినిమా కేవలం 5 రోజుల్లోనే బ్రేక్‌ ఈవెన్‌ ను సాధించింది.సినిమా షూటింగ్‌ సమయంలోనే అంచనాలు పెరగడంతో విడుదల సమయంలో హైప్‌ వచ్చింది.దాంతో సినిమాను అన్ని ఏరియాలకు కలిపి దాదాపుగా రూ.19 కోట్లకు కొనుగోలు చేయడం జరిగింది.సినిమా మొదటి రోజు కాస్త అటు ఇటు అవ్వడంతో ఆలస్యం అయ్యింది.అయినా కూడా ప్రేక్షకులు నిరుత్సాహం వ్యక్తం చేయకుండా సినిమాను చూసేందుకు ప్రేక్షకులు క్యూ కట్టారు.

కరోనా భయంను పక్కన పెట్టి ప్రతి ఒక్కరు కూడా థియేటర్ల ముందు క్యూ కట్టడంతో అయిదు రోజుల్లోనే దాదాపుగా 20 కోట్లు వసూళ్లు రాబట్టి బ్రేక్‌ ఈవెన్‌ ను దక్కించుకుంది.ఇదో అద్బుతమైన రికార్డుగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

#Ravi Teja #Sruthi Hassan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు