ఖిలాడీ షూటింగ్ కు బ్రేక్.. ఆ సమయాన్ని చిత్ర యూనిట్ అలా వాడుకుంటుందట !

సంక్రాంతికి రిలీజైన క్రాక్ సినిమాతో మాస్ మహారాజ రవితేజ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.ఈ సినిమా హిట్ తన కెరీర్ కు కీలకం అవ్వడంతో కథ సెలక్షన్ జాగ్రత్తగా చేసి సూపర్ హిట్ కొట్టాడు.

 Ravi Teja Khiladi Shooting Break In Italy-TeluguStop.com

ఈ సినిమాతో తన ఇమేజ్ కూడా పెంచుకున్నాడు.మళ్ళీ మాస్ మహారాజా రవితేజ అని అనిపించుకున్నాడు.

క్రాక్ హిట్ తో వరస పెట్టి సినిమాలు చేస్తూ మంచి జోరు మీద ఉన్నాడు.

 Ravi Teja Khiladi Shooting Break In Italy-ఖిలాడి షూటింగ్ కు బ్రేక్.. ఆ సమయాన్ని చిత్ర యూనిట్ అలా వాడుకుంటుందట -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

క్రాక్ సినిమా కరోనా తర్వాత రిలీజైన మొదటి స్టార్ హీరో సినిమా కావడంతో అందులోనూ కథ ప్రేక్షకులకు బాగా నచ్చడంతో ఈ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిపారు.

క్రాక్ సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు కుమ్మేసింది.ప్రస్తుతం రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ఇటలీలో శరవేగంగా జరుగుతుంది.

రెండు మూడు రోజులుగా ఖిలాడీ చిత్ర యూనిట్ వరసగా ఫోటోలు షేర్ చేస్తూ ఉన్నారు.

ఈ మధ్యే అనసూయ కూడా షూటింగ్లో జాయిన్ అయ్యి తన పాత్రను కంప్లీట్ చేసింది.షూటింగ్ లో అనసూయ ఫోటోలు బయటకు రావడంతో వైరల్ అయ్యాయి.తాజాగా అర్జున్ కూడా షూట్ లో జాయిన్ అయ్యాడు.రవితేజ, అర్జున్ ఫోటో షేర్ చేయడంతో ఈ ఫోటో కూడా వైరల్ అయ్యింది.

అయితే చిత్ర యూనిట్ వరసగా ఫోటోలు షేర్ చేయడం వెనుక మరొక కథ ఉన్నట్టు తెలుస్తుంది.

Telugu Anasuya, Arjun, Corona, Italy, Khiladi, Khiladi In Italy, Khiladi Movie Promotions, Khiladi Shooting Update, Khiladi Team, Lock Down, Ravi Teja, Raviteja And Arjun, Sharing Photos, Shooting Break, Viral Photos-Movie

ఇటలీలో కరోనా ఎక్కువుగా ఉండడంతో లాక్ డౌన్ విధించారు.అందువల్ల షూటింగ్ లు నిలిచిపోవడంతో ఇప్పుడు ఖిలాడీ చిత్ర యూనిట్ కూడా షూటింగ్ ఆపేసి ఖాళీగా ఉందట.అందుకే ఈ ఖాళీ సమయాన్ని తమ చిత్ర ప్రొమోషన్ కోసం వాడుకోవాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయ్యిందట.

అందుకే షూటింగ్ కు సంబంధించి వరుసగా ఫోటోలు షేర్ చేస్తూ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది.

ఇటలీలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి కొన్ని రోజుల క్రితం ఖిలాడీ టీమ్ ఇటలీ వెళ్ళింది.

షూటింగ్ జరుగుతున్నా నగరంలో కూడా కరోనా ఎక్కువ ఉండడంతో లాక్ డౌన్ అయ్యింది.అందుకే గత రెండు రోజులుగా ఖిలాడీ సినిమాకు సంబంధించి వరుసగా ఫోటోలు షేర్ చేస్తుంది.

ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న అనసూయ కూడా ఇటలీ లోనే ఇరుక్కుపోయిందట.

#Ravi Teja #Corona #Khiladi #Raviteja Arjun #Anasuya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు