'ఖిలాడీ' టీజర్ కు ముహూర్తం ఫిక్స్..!

మాస్ మహారాజ రవితేజ సంక్రాంతికి రిలీజైన క్రాక్ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.అంతేకాదు తన ఇమేజ్ కూడా పెంచుకున్నాడు.

 Ravi Teja Khiladi Movie Teaser Update-TeluguStop.com

మళ్ళీ మాస్ మహారాజా రవితేజ అని అనిపించుకున్నాడు.తన కెరీర్ కు కీలకంగా మారిన క్రాక్ సినిమా హిట్ అవ్వడంతో రవితేజ ఫుల్ ఖుషీగా ఉన్నాడు.

క్రాక్ సినిమా కరోనా తర్వాత రిలీజైన మొదటి స్టార్ హీరో సినిమా కావడంతో అందులోనూ కథ ప్రేక్షకులకు బాగా నచ్చడంతో ఈ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిపారు.

 Ravi Teja Khiladi Movie Teaser Update-ఖిలాడీ’ టీజర్ కు ముహూర్తం ఫిక్స్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమా తర్వాత రవితేజ వరస పెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.

ప్రస్తుతం రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ మొన్నటి వరకు ఇటలీలో శరవేగంగా జరిగింది.

కానీ ఇటలీలో కేసులు ఎక్కువ అయిన కారణంగా లాక్ డౌన్ విధించారు.అందువల్ల షూటింగ్ వాయిదా పడింది.

ఈ సినిమాలో అనసూయ కూడా కీలక పాత్రలో నటిస్తుంది.

ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.రవితేజకు జోడీగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈ సినిమాను పెన్ స్టూడియోస్ సమర్పణలో హవీష్ ప్రొడక్షన్ బ్యానర్ పై సత్యనారాయణ కోనేరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదల అయిన ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లిమ్స్ నుండి మంచి స్పందన వచ్చింది.

అయితే ఇప్పుడు ఈ సినిమా నుండి టీజర్ విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఉగాది కానుకగా ఖిలాడీ సినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ తెలిపారు.ఈ టీజర్ ను ఏప్రిల్ 12న ఉదయం 10 గంటల 8 నిముషాలకు రిలీజ్ చెయ్యబోతున్నారు.

ఈ పోస్టర్ లో రవితేజ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

#Khiladi Teaser #RaviTeja #Khiladi #12th April #Ravi Teja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు