రవితేజ నుండి ఊహించని ప్రకటన.. ఫ్యాన్స్‌ కు డబుల్‌ ధమాకా

వరుస ఫ్లాప్‌ ల్లో ఉన్న రవితేజ కు మరియు కష్టాల్లో ఉన్న ఇండస్ట్రీకి కూడా క్రాక్‌ సినిమా మంచి బూస్ట్‌ ఇచ్చింది.సంక్రాంతికి ముందు వచ్చిన క్రాక్‌ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

 Ravi Teja Announced Khiladi Movie Release On May 28, Ramesh Varma, Raviteja, Khi-TeluguStop.com

దాదాపుగా 50 కోట్ల వసూళ్లను దక్కించుకున్న ఈ సినిమా ఈ ఏడాదికి మంచి స్టార్ట్‌ ను ఇచ్చింది.దాంతో వరుసగా సినిమాలు కూడా విడుదల అయ్యి మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నాయి.

మొత్తం సినిమా పరిశ్రమకు క్రాక్‌ సినిమా ఓ రేంజ్ లో ఎనర్జిని ఇచ్చింది.అందుకే రవితేజ కు ఇయర్‌ ఆఫ్‌ ది హీరోగా సోషల్‌ మీడియా గుర్తింపు ఇచ్చేసింది.

ఈ సమయంలోనే రవితేజ నుండి మరో సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.క్రాక్‌ విడుదలకు కాస్త ముందు ప్రారంభం అయిన ఖిలాడి సినిమా అప్పుడే విడుదల తేదీతో వచ్చేసింది.

ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న రమేష్‌ వర్మ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించిన యూనిట్‌ సభ్యులు పలు సినిమాలకు పోటీగా నిలుస్తున్నారు.

మే 28న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది.రవితేజ ఈ సినిమాలో స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు.

డింపుల్‌ హయతి హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు.విభిన్నమైన చిత్రాలతో అలరిస్తున్న రవితేజకు ఈమద్య సక్సెస్‌ లేదు.

క్రాక్‌ తో ఆయన మళ్లీ ఫామ్‌ లోకి వచ్చాడు.కనుక ఖిలాడి సినిమా కూడా ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేయడం ఖాయం అంటున్నారు.

ఖిలాడి సినిమా కూడా సక్సెస్ అయితే రవితేజ కెరీర్ మరో నాలుగు అయిదు సంవత్సరాలు ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగుతుంది అనడంలో సందేహం లేదు.అద్బుతమైన ఎంటర్‌టైన్‌ మెంట్‌ కథలను ఎంపిక చేసుకుని చేస్తున్న రవితేజ ఈ సినిమాతో మరింతగా ఎంటర్‌ టైన్‌ చేస్తాడని ప్రతి ఒక్కరు నమ్మకంగా ఉన్నారు.

Telugu Devi Sri Prasad, Dimple Hayathi, Khiladi, Krack, Ramesh Varma, Ravi Teja, .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube