మళ్లీ రవితేజనే పునః ప్రారంభించబోతున్నాడా?

కరోనా సెకండ్‌ వేవ్ కారణంగా థియేటర్లు రెండు నెలలుగా మూత పడే ఉన్నాయి.వచ్చే నెలలో థియేటర్లు పునః ప్రారంభంకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

 Ravi Teja Khiladi Movie Release Date-TeluguStop.com

ఇప్పటికే లాక్ డౌన్ మరియు కర్ఫ్యూ విషయంలో ప్రభుత్వాలు మెల్ల మెల్లగా డౌన్‌ చేశాయి.మరో వారం పది రోజుల్లో పూర్తిగా ఎత్తి వేసే అవకాశాలు ఉన్నాయి.

ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు థియేటర్లు ఓపెన్‌ చేయబోతున్న నేపథ్యంలో సినిమాలు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రవితేజ థియేటర్లు ఓపెన్‌ అయిన వెంటనే విడుదల చేయాలని భావిస్తున్నాడట.

 Ravi Teja Khiladi Movie Release Date-మళ్లీ రవితేజనే పునః ప్రారంభించబోతున్నాడా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తన ఖిలాడి సినిమాకు సంబంధించిన విడుదల ఏర్పాట్లను మొదలు పెట్టారని సమాచారం అందుతోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఖిలాడి సినిమా ను జులై విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

రవితేజ క్రాక్ సినిమా కూడా గత ఏడాది థియేటర్లు మూసి వేసి పునః ప్రారంభం చేసిన తర్వాత ఆరంభంలో విడుదల చేయడం జరిగింది.ప్రస్తుతం రవితేజ కూడా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది.

థియేటర్లు ప్రారంభం అయిన వెంటనే 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే అనుమతించే అవకాశం ఉంది.ఎలా ఉన్నా కూడా ఖచ్చితంగా సినిమాను విడుదల చేసేందుకు ఖిలాడీ మేకర్స్ సిద్దం అవుతున్నారనే వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం సినిమా విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.ఖిలాడి సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహించాడు.ఈయన గత చిత్రం రాక్షసుడు మంచి విజయాన్నిసొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.మరి ఈ సినిమా తో రవితేజ తన క్రాక్‌ ట్రాక్ ను కంటిన్యూ చేస్తాడా అనేది చూడాలి.

#Ravi Teja #KhiladiMovie #Lockdown #Khiladi #Corona 2nd Wave

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు