రవితేజ మరీ ముందు చూపు.. ఈ సమయంలో విడుదల తేదీ ఏంటీ బాసూ?

మాస్ హీరో రవితేజ ఈ ఏడాది ఆరంభంలో క్రాక్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.క్రాక్‌ సినిమా తో సూపర్‌ హిట్ ను దక్కించుకుని సుదీర్ఘ కాలం తర్వాత సక్సెస్‌ ను దక్కించుకున్న రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వం లో సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.

 Ravi Teja Khiladi Movie New Release Date-TeluguStop.com

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న రమేష్ వర్మ దర్శకత్వం లో సినిమాకు ఖిలాడీ అనే టైటిల్‌ ను నిర్ణయించినట్లుగా సమాచారం అందుతోంది.భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా ను వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావించారు.

కాని కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా విడుదల విషయంలో గందరగోళం నెలకొంది.అన్ని సినిమా లతో పాటు ఆ సినిమా ను కూడా వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు.

 Ravi Teja Khiladi Movie New Release Date-రవితేజ మరీ ముందు చూపు.. ఈ సమయంలో విడుదల తేదీ ఏంటీ బాసూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాని ఖిలాడీ సినిమా కొత్త విడుదల తేదీ అప్పుడే వచ్చింది.

కరోనా సెకండ్‌ వేవ్‌ ఎన్నాళ్లు ఉంటుంది అనేది తెలియని పరిస్థితి.

ఇలాంటి పరిస్థితుల్లో సినిమా లను విడుదల చేసేందుకు ఇప్పటి వరకు కొత్త విడుదల తేదీలను ప్రకటించలేదు.కాని ఇటీవలే ఖిలాడీ సినిమా విడుదల తేదీ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చారనే వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం జులై 2వ తేదీన సినిమా ను విడుదల చేయాలని భావిస్తున్నారు.జూన్‌ వరకు పరిస్థితులు చక్క బడుతాయని వారు భావిస్తున్నారట.అందుకే జులై లో సినిమా ను విడుదల చేస్తామని చెబుతున్నారు.సినిమా రెండు మూడు వారాల షూటింగ్ బ్యాలన్స్ ఉంది.

దాన్ని వచ్చే నెలలో పూర్తి చేసి వెంటనే విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారట.రవితేజ ఈ సినిమా లో చాలా విభిన్నంగా కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

రమేష్ వర్మ గత చిత్రం సక్సెస్ అయిన నేపథ్యం లో ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.

#RavitejaKhiladi #Khiladi #Ramesh Varma #Ravi Teja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు