క్రాక్ సక్సెస్ తో ఖిలాడీ కి ఆ మార్పులు, మళ్లీ సక్సెస్‌ ఖాయం

మాస్ మహారాజ్ రవి తేజ ఈ ఏడాది ప్రారంభంలో క్రాక్ చిత్రంతో హిట్ట్ కొట్టి వరసగా వస్తున్న ఫ్లాప్స్ కు స్వస్తి పలికాడు.దర్శకుడు గోపిచంద్ మలినేని ఈచిత్రానికి దర్శకత్వం వహించాడు.

 Changes In Khiladi Movie Script, Raviteja, Khiladi Movie, Krack Movie Success, R-TeluguStop.com

ఒంగోలు బ్యాక్ డ్రాప్ లోని కట్టారి కృష్ణ అనే రౌడీ షీటర్ జీవితంలోని కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకొని దానికి కమర్షియల్ హంగులను జోడిస్తూ నేడు ప్రస్తుతం ఉన్న నేటివిటీకి తగిన విదంగా ఈ చిత్రాని రూపొందించాడు.పోలీసు పాత్రలో రవి తేజ అదరగొట్టాడు.

కట్టారి కృష్ణ పాత్రలో తమిళ దర్శకుడు సముద్రఖని మెప్పించాడు.ఆయన లవర్ గా జయ్యమ్మ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించి ఆకట్టుకుంది.
ఈ రెండు పాత్రలకు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఫిదా అయ్యిపోయారు.మాస్ మహారాజ్ పక్కన శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.రవి తేజ తన తదుపరి చిత్రాన్ని రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి అనే చిత్రంలో నటిస్తున్నాడు.ఇటీవలే విడుదలైన రవి తేజ ఖిలాడి పోస్టర్ కు ప్రేక్షకులు, అభిమానులనుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.‘క్రాక్‌’ సక్సెస్ తో ఖిలాడీ చిత్రంలో కూడా భారీ మార్పులు చేస్తున్నారు.దీంతో మళ్లీ సక్సెస్‌ ఖాయం అని తెలుస్తుంది.

ఖిలాడి చిత్రంలో కూడా క్రాక్ చిత్రంలో ఉన్న అన్నీ కమర్షియల్ హంగులు ఉండేవిదంగా ముందే అన్నీ జాగ్రత్తలు చిత్ర బృందం తీసుకుంటుంది.

Telugu Khiladi Script, Khiladi, Krack, Ramesh Varma, Ravi Teja, Raviteja, Ravite

క్రాక్ మాదిరి ఈ చిత్రంలో కూడా పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ ను ప్లాన్ చేస్తున్నారు.ఓ ప్రముఖ విలన్ ఈ చిత్రంలో నటించనున్నాడు.ఈ విషయంపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

డింపుల్ హయాతి, మీనా చౌదరి లు కీలక పాత్రలో నటించనున్నారు.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

రవి తేజ సరసన ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అనే విషయం ను త్వరలో ప్రకటించనున్నారు.క్రాక్ తో విజయం వైపు ప్రయాణిస్తున్న రవితేజ ఖిలాడి చిత్రంతో మరో సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube