హాలీవుడ్ మూవీ ఆధారంగా రవితేజ నెక్స్ట్ సినిమా.. ఇదైనా..

మాస్ మహా రాజా రవితేజ సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా ఎప్పుడు జెట్ స్పీడ్ తోనే దూసుకు పోతాడు.ఏడాదికి మూడు నాలుగు సినిమాలను పక్కాగా విడుదల చేస్తాడు.

 Ravi Teja Is Doing That Hollywood Movie Details, Ravi Teja, Dhamaka Movie, ‎ra-TeluguStop.com

ఈయన గ్యాప్ లేకుండా సినిమాలు అనౌన్స్ చేసి అంతే వేగంగా షూటింగ్ కూడా పూర్తి చేస్తున్నాడు.

ప్రెజెంట్ రవితేజ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాలో రవితేజ కు జోడీగా పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల నటిస్తుంది.అలాగే రావణాసుర సినిమా కూడా సెట్స్ మీదనే ఉంది.సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇంకా రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా వేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.

వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా వ్యాప్తంగా తెరకెక్కిస్తున్నారు.ఇన్ని సినిమాలు సెట్స్ మీద ఉండగానే మరికొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే ఉన్నాడు రవితేజ.

తాజాగా సినిమాటోగ్రాఫర్ ఘట్టమనేని కార్తీక్ చెప్పిన స్టోరీ నచ్చడంతో ఓకే చెప్పారట.మరి ఈ సినిమా గురించి లేటెస్ట్ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.

Telugu Dhamaka, John Wick, Ravanasura, Ravi Teja, Ravitejakarthik, Tigernageswar

కార్తీక్ ఘట్టమనేని సూర్య వర్సెస్ సూర్య సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు.ఇక ఇప్పుడు రవితేజ అవకాశం ఇవ్వగా ఈ సినిమాను స్టైలిష్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా పోలాండ్ లో అక్టోబర్ లో షూట్ స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.అంతేకాదు ఈ సినిమా హాలీవుడ్ మూవీ జాన్ వీక్ ఆధారంగా తెరకెక్కించ బోతున్నారని వార్తలు వస్తున్నాయి.

అలాగే ఈ సినిమాకు ఈగల్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేయగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.మరి ఈ డైరెక్టర్ ఈ సినిమాతో అయినా మంచి హిట్ కొడుతాడో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube