క్రాక్‌ ప్రివ్యూ... రవితేజ సినీ కెరీర్‌కు ఇది మరో టర్నింగ్ పాయింట్‌

మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన క్రాక్‌ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గోపీ చంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు.

 Ravi Teja Gopichand Malineni Movie Krack Movie Preview,  Mass Maharaja Ravi Teja-TeluguStop.com

సాదారణంగా సంక్రాంతి సినిమాలు అంటే ఆ సందడి వేరు.కాని ఈసారి సంక్రాంతి సినిమాల సందడి అంతగా లేదు.

కరోనా కారణంగా థియేటర్లను 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే నడిపించాలని ఆదేశాలు ఉన్నాయి.ఇక కరోనా భయం ఇంకా ఉన్న కారణంగా జనాలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు.

ఈ సమయంలో రవితేజ క్రాక్‌ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇండస్ట్రీ వర్గాలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.గత రెండు మూడు సంవత్సరాలుగా రవితేజకు సరైన హిట్‌ పడ లేదు.

దాంతో ఆయన కెరీర్‌ లో వెనక పడ్డాడు.ఈ సినిమా హిట్‌ అయితే మళ్లీ ఆయన కెరీర్‌ టర్న్‌ అవ్వడం ఖాయం అన్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Occupancy, Balupu, Crack, Gopichand, Krack, Krack Review, Massmaharaja, R

క్రాక్‌ సినిమా సెంటిమెంట్‌ పరంగా చూస్తే సక్సెస్‌ అవ్వడం ఖాయం అనిపిస్తుంది.గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఇప్పటికే రవితేజ రెండు సినిమాలు చేశాడు.ఆ రెండు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.ఆ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమా హిట్‌ అవ్వడం ఖాయం అంటున్నారు.

ఇక హీరోయిన్‌ శృతి హాసన్‌ తో రవితేజ చేసిన గత సినిమా బలుపు హిట్‌ అయ్యింది.కనుక అది కూడా ఒక సెంటిమెంట్‌.ఇక ఈ సినిమాకు సక్సెస్‌ రచయిత సాయి మాధవ్‌ బుర్ర పని చేశారు.కనుక ఇది కూడా ఒక సెంటిమెంట్‌ గా మారబోతుంది అంటున్నారు.

చివరగా థమన్‌ సంగీతం తో ఇటీవల వరుసగా సక్సెస్ లు అందుకుంటున్నాడు.కనుక ఈ సినిమా కూడా విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే నమ్మకంను మాస్ రాజా అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

మరి సినిమా ఫలితం ఏంటీ అనేది మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube