మాస్ రాజా యమ స్పీడ్..అప్పుడే 'ధమాకా' ఫస్ట్ షెడ్యూల్ పూర్తి!

Ravi Teja Dhamaka Movie Wraps Up First Schedule

మాస్ మహారాజా కెరీర్ లో ఎప్పుడు జెట్ స్పీడ్ తోనే దూసుకు పోతాడు.ఏడాదికి మూడు నాలుగు సినిమాలను పక్కాగా విడుదల చేస్తాడు.

 Ravi Teja Dhamaka Movie Wraps Up First Schedule-TeluguStop.com

అయితే కరోనా వల్ల గత రెండు సంవత్సరాలు స్పీడ్ తగ్గించాడు.ఇక మళ్ళీ ఈ మధ్యనే వరుస సినిమాలు ప్రకటిస్తూ మళ్ళీ పాత స్పీడ్ ను కంటిన్యూ చేస్తున్నాడు.

ప్రెసెంట్ రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

 Ravi Teja Dhamaka Movie Wraps Up First Schedule-మాస్ రాజా యమ స్పీడ్..అప్పుడే ధమాకా’ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు.ఈ సినిమాలో రవితేజకు జోడీగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి నటిస్తున్నారు.ఇక ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.ఖిలాడీ సెట్స్ మీద ఉండగానే వరుస సినిమాలు ప్రకటిస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నాడు.

ఖిలాడీ సినిమాతో పాటు రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకు వెళ్ళాడు.

శరత్ మండవ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఇక ఈ రెండు సినిమాలు రిలీజ్ అవ్వకముందే మరొక సినిమాను ప్రకటించాడు.విజయ దశమి సందర్భంగా రవితేజ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించాడు.

ఆ రోజే ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను కూడా విడుదల చేసారు.ఈ సినిమాకు ‘ధమాకా‘ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తున్నట్టు ప్రకటించడమే కాకుండా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేసారు.

Telugu Dhamaka, Dhamaka, Dhamakawraps, Dimple Hatiya, Khiladi, Ramesh Varma, Ravi Teja, Raviteja, Trinadharao-Movie

ఈ సినిమాలో కూడా రవితేజ డ్యూయెల్ రోల్ లోనే నటిస్తున్నట్టు తెలుస్తుంది.దసరా రోజునే ప్రకటించిన ఈ సినిమా అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో పెళ్లి సందD బ్యూటీ శ్రీలీల రవితేజకు జోడీగా నటిస్తుంది.ఈ సినిమాను టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఇంత త్వరగా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేయడంతో అందరు ఆశ్చర్య పోతున్నారు.మిగతా హీరోలతో పోలిస్తే రవితేజ యమ స్పీడ్ గా దూసుకు పోతున్నాడనే చెప్పాలి.

#Dhamaka #Dhamaka #Khiladi #Ramesh Varma #TrinadhaRao

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube