Ravi Teja Dhamaka: 'ధమాకా' రన్ టైం ఫిక్స్.. ఇది కూడా మాస్ రాజాకు కలిసి వస్తుందా?

మాస్ మహారాజా రవితేజ ఒకప్పుడు వరుస హిట్స్ ను ఖాతాలో వేసుకునే వారు.కానీ ఇప్పుడు మాత్రం వరుస ప్లాప్స్ ఎదుర్కొంటున్నాడు.

 Ravi Teja dhamaka Movie Run Time Lock Details, ravi Teja, Dhamaka Movie, Sreel-TeluguStop.com

ఒక్క సూపర్ హిట్ వస్తే.ఆ వెంటనే బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ ఎదురవుతూనే ఉన్నాయి.

అందుకే రవితేజ రేసులో వెనకబడి పోతున్నాడు.ఇటీవలే రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్లాప్ ఎదుర్కున్నాడు.

ఇక ఈ సినిమా తర్వాత రవితేజ నుండి మరో సినిమా రాబోతుంది.ప్రెసెంట్ ఈయన చేస్తున్న సినిమాల్లో త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా ఒకటి.ఈ సినిమాను కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినట్టు చిత్ర యూనిట్ తెలిపారు.

ఇక ఇప్పుడు ఈ సినిమాను క్రిస్మస్ బరిలో దింపబోతున్నారు.

డిసెంబర్ 23న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

దీంతో మేకర్స్ వరుస ప్రొమోషన్స్ చేయడానికి సిద్ధం అవుతున్నారు.తాజాగా ఈ సినిమా నుండి ఒక న్యూస్ బయటకు వచ్చింది.

ఈ సినిమా రన్ టైం కేవలం రెండు గంటల పది నిముషాల లోపే ఉంది అని టాక్ బయటకు వచ్చింది.

Telugu Dhamaka, Dhamaka Runtime, Trinadharao, Ravi Teja, Ravitejadhamaka, Sreele

అంతేకాదు ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి లాస్ట్ సీన్ వరకు ఆడియెన్స్ సూపర్ గా ఎంజాయ్ చేస్తారని.కామెడీ అదిరే లెవల్ లో ఉంటుంది అని తెలుస్తుంది.

ఇంత తక్కువ నిడివి గల రన్ టైం మంచి ప్లస్ అవుతుందని అంటున్నారు.

దీంతో ధమాకా సినిమాకు ఈ విషయం ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇక ఈ సినిమాలో రవితేజకు జోడీగా పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల నటిస్తుంది.

అలాగే రవితేజ ఇందులో డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నాడు.వివేక్ కూచిభట్ల సహా నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.అలాగే భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube