17 కోట్లు డిమాండ్ చేస్తున్న రవితేజ

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలలో ఒకడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు మాస్ మహారాజ్ రవితేజ.మాస్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలతో సక్సెస్ ఫుల్ హీరోగా రవితేజ దూసుకుపోతున్నాడు.

 Ravi Teja Demand 17 Crore Remuneration, Krack Movie, Khiladi Movie, Tollywood,ra-TeluguStop.com

ట్రెండ్ కి తగ్గట్లు తనని తాను మార్చుకుంటూ కొత్త కథలని ఆహ్వానిస్తూనే కమర్షియల్ ఎలిమెంట్స్, తనదైన కామెడీ ఉండే విధంగా చూసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు.ఇక రీసెంట్ గా క్రాక్ సినిమాతో రవితేజ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.

ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ మూవీ చేస్తున్నాడు.ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

దీని తర్వాత శరత్ మండవ దర్శకత్వంలో ఓ థ్రిల్లర్ జోనర్ లో మూవీ చేయబోతున్నాడు.

ఈ మూవీ కూడా త్వరలో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు రవితేజ రెమ్యునరేషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. క్రాక్ సినిమా వరకు రవితేజ 11 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునేవాడు.

అయితే ఒక్కసారిగా తన బడ్జెట్ ని అమాంతం పెంచేసే 17 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం ఆ స్థాయిలోనే రెమ్యునరేషన్ ని రవితేజ తీసుకుంటున్నాడని తెలుస్తుంది.

ఒక్కసారిగా రవితేజ ఈ స్థాయిలో రెమ్యునరేషన్ పెంచడానికి కారణం తన మార్కెట్ వేల్యూనే అని తెలుస్తుంది.అతనితో సినిమా చేస్తే మినిమం గ్యారెంటీ 30 నుంచి 40 కోట్లు రాబడి వస్తుంది.

ఈ నేపధ్యంలోనే రవితేజ ఉన్నపళంగా ఇలా తన రెమ్యునరేషన్ ని పెంచేసినట్లు టాక్ వినిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube