రవితేజ బర్త్ డే బిగ్ సర్ప్రైజ్.. ఆ రోజు 6 సినిమాల అప్డేట్స్ పక్కా..

ఒకే ఒక్క హిట్ తో మళ్ళీ మాస్ రాజా అనిపించు కుంటున్నాడు రవితేజ.వరుస సినిమాలు చేస్తూ తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు.

 Ravi Teja Birthday Surprise 6 Movies Updates For On His Birthday, Ravi Teja, Bir-TeluguStop.com

రవితేజ స్పీడ్ ను మిగతా హీరోలు అందుకోవడం చాలా కష్టం.ఎందుకంటే రవితేజ ఏడాది నాలుగు సినిమాలు చేస్తూ జెట్ స్పీడ్ గా దూసుకు వెళ్తాడు.

క్రాక్ సినిమాతో మాస్ మహారాజ రవితేజ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.

ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూనే భారీ పారితోషికం కూడా అందుకుంటూ దూసుకు పోతున్నాడు.

పారితోషికం పెంచేసిన కూడా నిర్మాతలు రవితేజ తో సినిమా చేయడానికి వెనకడుగు వేయడం లేదు.ఈయన ప్రెసెంట్ 5 సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.మరొక రెండు రోజుల్లో రవితేజ పుట్టిన రోజు రాబోతున్న నేపథ్యంలో ఈయన అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు.

జనవరి 26న ఈయన పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 అప్డేట్ లను ఇచ్చి ఫ్యాన్స్ ను బిగ్ సర్ప్రైజ్ చేయనున్నాడు.రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో చేసిన ‘ఖిలాడీ‘ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఫిబ్రవరి 11న రిలీజ్ కాబోతుంది.ఈ సినిమా నుండి రవితేజ పుట్టిన రోజు నాడు పక్కా మాస్ సాంగ్ విడుదల చేయనున్నట్టు ఇప్పటికే పోస్టర్ ద్వారా తెలిపారు.

ఇంకా రవితేజ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ధమాకా సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతుంది.పక్కా ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది.ఈ సినిమా నుండి రవితేజ పుట్టిన రోజు నాడు ఫస్ట్ లుక్ షూటింగ్ అప్డేట్ కూడా.

దీంతో పాటు శరత్ మండవ దర్శకత్వంలో ‘రామారావు ఆన్ డ్యూటీ‘ సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకు వెళ్ళాడు.

ఈ సినిమాలో గవర్నమెంట్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.ఈ సినిమా నుండి జనవరి 26న టీజర్ రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.

అలాగే స్వామిరారా ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర సినిమాను చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే స్టార్ట్ కానుంది.ఇందులో రవితేజ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్టు టాక్.ఈ సినిమా నుండి కూడా రవితేజ బర్త్ డే రోజు అప్డేట్ రానుంది.

ఇంకా వంశీ దర్శకత్వంలో స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ తెరకెక్కనుంది.ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించనుండగా ఈ సినిమాకు ఏకంగా 18 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట.

ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా రవితేజ పుట్టిన రోజు నాడే రానుంది.

ఇక ఈ ఐదు సినిమాలే కాకుండా రవితేజ తన బర్త్ డే నాడు మరొక కొత్త సినిమా అనౌన్స్ చేయనున్నట్టు టాక్.

సీనియర్ డైరెక్టర్ దర్శకత్వంలో ఈ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది.మరి ఈ ఆరు అప్డేట్ లతో రవితేజ ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్ ఇవ్వనున్నాడు.

Ravi Teja Birthday Surprise 6 Movies Updates For On His Birthday, Ravi Teja, Birthday Surprise, 6 Movies Updates, Ravanasura - Telugu Ups, Surprise, Ravanasura, Ravi Teja, Raviteja #Shorts

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube