ఒక్క రోజే మూడు సినిమాల అప్‌డేట్స్ తో రాబోతున్న స్టార్‌ హీరో

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం చేస్తున్న సినిమాల జాబిత చాలా పెద్దదే అనే విషయం తెల్సిందే.ఆయన వరుస సినిమా లతో ఈ ఏడాది బాక్సాఫీస్ ను షేక్‌ చేయబోతున్నాడు.

 Ravi Teja Birthday Special Khiladi Song Release Details, Mass Maharaj Raviteja,-TeluguStop.com

మొదటగా వచ్చే నెలలో ఖిలాడీ సినిమా ను విడుదల చేయబోతున్నాడు.అది మాత్రమే కాకుండా రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, టైగర్ నాగేశ్వరరావు మరియు రావణాసుర సినిమాలను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.

ఇక రేపు జనవరి 26వ తారీకు.అంటే రవితేజ పుట్టిన రోజు.

దాంతో ఆయన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ బ్యాక్ టు బ్యాక్‌ రాబోతున్నాయి.అందుకు సంబంధించిన షెడ్యూల్‌ ను రవితేజ పీఆర్ టీమ్‌ ప్రకటించింది.

మొదటగా రేపు ఉదయం పది గంటలకు ఫుల్ కిక్ పాటను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.

ఆ తర్వాత 12 గంటలకు రామారావు ఆన్‌ డ్యూటీకి సంబంధించిన విడుదల తేదీ తో ఉన్న పోస్టర్ ను విడుదల చేయబోతున్నారు.

ఇక సాయంత్రం 4 గంటలకు ధమాకా సినిమా కు సంబంధించిన ఇంట్రెస్టింగ్‌ విషయాన్ని వెళ్లడించబోతున్నట్లుగా తెలుస్తోంది.మొత్తానికి ధమాకా సినిమా పై ఉన్న అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ మూడు సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ తో రవితేజ బర్త్‌ డే మహా రంజుగా సాగబోతున్నట్లుగా నెటిజన్స్‌ చెబుతున్నారు.ప్రస్తుతం రవితేజ చేస్తున్న సినిమా ల సంఖ్య చాలా పెద్దగా ఉంది.ఆ సినిమా ల్లో రెండు లేదా మూడు ఈ ఏడాదిలో విడుదల కాబోతుండగా.వచ్చే ఏడాది లో మరో రెండు మూడు సినిమాలు విడుదల అవ్వబోతున్నాయి.అంటే రాబోయే రెండేళ్ల కాలంలో రవితేజ ఏకంగా ఆరు సినిమా లను విడుదల చేయబోతున్నాడు.ఈ స్థాయిలో మరే తెలుగు హీరో కూడా విడుదల చేయక పోవచ్చు.

Ravi Teja Birthday Special Khiladi Song Release Details, Mass Maharaj Raviteja, Dhamaka, Khiladi, Ramarao On Duty, Raviteja Movie Updates, Tiger Nageswara Rao, Full Kicku Song - Telugu Dhamaka, Full Kicku, Khiladi, Rama Rao Duty, Ramarao Duty, Ravi Teja, Raviteja Ups, Tigernageswara

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube