జనవరిలో ‘బెంగాల్‌ టైగర్‌’  

  • మాస్‌ మహారాజ రవితేజ మరియు సంపత్‌ నంది దర్శకత్వంలో ‘బెంగాల్‌ టైగర్‌’ తెరకెక్కబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే. ఇక ఈ సినిమా షూటింగ్‌ను జనవరిలో ప్రారంభించబోతున్నట్లు చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. జనవరి మొదటి లేదా రెండవ వారంలో ఈ సినిమాను సినీ మరియు రాజకీయ నాయకుల సమక్షంలో వైభవంగా ప్రారంభించబోతునామన్నారు. మార్చి మొదటి వారంలో రెగ్యులర్‌ షూటింగ్‌ కార్యక్రమాలు జరుపనున్నారు.

  • ఈ సినిమాలో రవితేజ సరసన తమన్నా మరియు రాశి ఖన్నాలు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఒక పక్కా మాస్‌ యాక్షన్‌ చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లుగా దర్శకుడు సంపత్‌ నంది చెబుతున్నాడు. దర్శకుడు సంపత్‌ నంది పవన్‌ కళ్యాణ్‌ సినిమా నుండి తప్పించిన తర్వాత చేస్తున్న సినిమా కావడంతో భారీ ఆసక్తి ఉంది. ఇక ఈ సినిమా టైటిల్‌తో పవన్‌ సినిమా చేసే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి. దాంతో మొత్తంగా ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులతో పాటు మెగా ఫ్యాన్స్‌లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మార్చిలో ప్రారంభం అయ్యే ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.