తమిళ్ డైరెక్టర్ కి ఒకే చెప్పిన మాస్ మహారాజ్

క్రాక్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలని ఒప్పుకుంటూ మంచి జోరు మీద ఉన్నాడు.ఇప్పటికే ఖిలాడీ సినిమాని రమేష్ వర్మ దర్శకత్వంలో చేస్తున్నాడు.

 Ravi Teja And Sarath Mandava Film Based On Real Incident-TeluguStop.com

ఈ సినిమా టీజర్ తాజాగా రిలీజ్ అయ్యి ఆకట్టుకుంది.థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో టీజర్ ని దర్శకుడు ఆవిష్కరించాడు.

ఇదిలా ఉంటే ఖిలాడీ సినిమా తర్వాత త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో రవితేజ సినిమా ఉంటుందని అందరూ భావించారు.ఇప్పటికే ఈ కాంబినేషన్ లో సినిమాని తాము నిర్మిస్తున్నట్లు అభిషేక్ పిక్చర్స్ నిర్మాతలు తెలిపారు.

 Ravi Teja And Sarath Mandava Film Based On Real Incident-తమిళ్ డైరెక్టర్ కి ఒకే చెప్పిన మాస్ మహారాజ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో సినిమాకి సంబందించిన ప్రీప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతుందని అందరూ భావించారు.అయితే ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది సస్పెన్స్ రివీల్ చేయలేదు.

ఇంతలో రవితేజ మరో దర్శకుడుకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు ఆ సినిమా ఓపెనింగ్ కూడా చేసేస్తున్నట్లు తెలుస్తుంది.

తమిళ స్టార్ హీరోలు అజిత్, కమల్ హాసన్ లతో సినిమాలు తీసిన శరత్ మండవ దర్శకత్వంలో మాస్ మహరాజ్ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.

ఇప్పటికే దర్శకుడు రవితేజకు స్టోరీ చెప్పగా ఆయన వెంటనే ఒకే చెప్పడం జరిగిపోయిందని టాక్.ఒక నిజ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెకించబోతున్నట్టు ఫిలిం నగర్ లో వినిపిస్తున్న మాట.ఇక ఈ సినిమా లాంచింగ్ కూడా చేసేయడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది.ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ లో నిర్మించాబోతున్నట్లు తెలుస్తుంది.

ఇక షూటింగ్ కూడా వేగంగానే స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.మరి ఈ సినిమా స్టార్ట్ చేస్తే త్రినాధ్ రావు సినిమాని రవితేజ ఎప్పుడు సెట్స్ పైకి తీసుకెళ్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

#Sarath Mandava #Ramesh Varma #Real Incident #Ravi Teja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు