మరో దర్శకుడిని లైన్‌ లోకి తీసుకున్న మాస్ మహారాజా

మాస్‌ మహారాజ రవితేజ కొన్ని సంవత్సరాల తర్వాత ‘క్రాక్‌’ సినిమా తో సక్సెస్‌ ను దక్కించుకున్నాడు.ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన క్రాక్‌ సినిమా కు మంచి వసూళ్లు నమోదు చేసింది.

 Ravi Teja And Maruthi Combo Movie Coming Soon-TeluguStop.com

క్రాక్‌ సినిమా ఇచ్చిన సక్సెస్‌ జోష్‌ తో రవితేజ వరుసగా సినిమాలు చేస్తున్నాడు.గత కొన్నాళ్లుగా ఢీలా పడి ఉన్న రవితేజ ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిరి పడుతున్నట్లుగా వరుస సినిమాలకు ఓకే చెబుతున్నాడు.

ప్రస్తుతం భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఖిలాడీ సినిమా లో రవితేజ నటిస్తున్నాడు.రమేష్‌ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

 Ravi Teja And Maruthi Combo Movie Coming Soon-మరో దర్శకుడిని లైన్‌ లోకి తీసుకున్న మాస్ మహారాజా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇటలీలో భారీ ఖర్చుతో చేసిన సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి.ఖిలాడీ సినిమా తర్వాత త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు ఇప్పటికే డేట్లను రవితేజ ఇచ్చాడనే వార్తలు వస్తున్నాయి.

మరో వైపు రవితేజ ఒక కమర్షియల్‌ మూవీ కోసం మారుతికి డేట్లు ఇచ్చాడనే వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం దర్శకుడు మారుతి పక్కా కమర్షియల్‌ మూవీ చేస్తున్నాడు.

గోపీచంద్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పక్కా కమర్షియల్‌ మూవీ కి మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు.ఆ సినిమా పూర్తి చేసి అక్టోబర్‌ లో విడుదల చేస్తానంటూ ఇప్పటికే మారుతి ప్రకటించాడు.

ఈ నేపథ్యంలో మారుతి మరో సినిమా ను కూడా ప్లాన్‌ చేస్తున్నాడు.రవితేజ హీరోగా మారుతి దర్శకత్వంలో సినిమా పట్టాలెక్కబోతుందని వార్తలు వస్తుంది.

ఈ ఏడాది చివరి వరకు కాని సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందంటున్నారు.వరుసగా పెద్ద సినిమాలు చేస్తున్న రవితేజ ఈసారి మారుతి దర్శకత్వంలో మీడియం రేంజ్‌ బడ్జెట్‌ లో చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

మారుతి మీడియం బడ్జెట్‌ తో సినిమా చేసి పెద్ద సినిమా రేంజ్ సక్సెస్‌ లను దక్కించుకుంటూ ఉంటాడు.కనుక రవితేజ మరోసారి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ సక్సెస్‌ ను దక్కించుకోవడం ఖాయం అంటున్నారు.

రవితేజ మరియు మారుతిల కాంబో మూవీ గురించిన అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది.

#Itlay Shooting #Maruthi #RaviTeja #Khiladi #Ravi Teja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు