ఈవారం కూడా కుమ్మేసిన క్రాక్‌.. మొత్తం వసూళ్ల లెక్క- Ravi Teja And Gopichand Malineni Movie Krack Still Getting Good Collections

ravi teja and gopichand malineni movie krack still getting good collections , ravi teja, gopichand malineni, krack movie, krack movie collections - Telugu Breaking News, Film News, Gopichand Malineni, Krack Movie, Krack Movie Collections, Ravi Teja, Ravi Teja And Gopichand Malineni Movie Krack Still Getting Good Collections

రవి తేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన క్రాక్‌ మూవీ వారి కాంబోకు హ్యాట్రిక్ విజయాన్ని కట్టబెట్టింది.అద్బుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నట్లుగా వసూళ్లు నమోదు అవుతున్నాయి.

 Ravi Teja And Gopichand Malineni Movie Krack Still Getting Good Collections-TeluguStop.com

దాదాపుగా ఏడాది పాటు ఇండస్ట్రీ మొత్తం వట్టి పోయినట్లుగా మారిపోయింది.కరోనా భయంతో జనాలు థియేటర్లకు వస్తారా రారా అనే భయంతో విడుదల అయిన క్రాక్‌ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లు నమోదు చేసింది.ఈ పరిస్థితుల్లో కనీసం పాతిక కోట్లు సంపాదిస్తే గొప్ప విజయం.15 కోట్లు వసూళ్లు చేస్తే సూపర్‌ హిట్‌ అన్నట్లుగా యూనిట్‌ సభ్యులు అనుకున్నారు.కాని ఇప్పటి వరకు నాలుగు పదుల కోట్లు క్రాస్‌ అయ్యింది.

 Ravi Teja And Gopichand Malineni Movie Krack Still Getting Good Collections-ఈవారం కూడా కుమ్మేసిన క్రాక్‌.. మొత్తం వసూళ్ల లెక్క-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంకా వసూళ్లు బాగానే వస్తున్నాయి.సంక్రాంతికి వచ్చిన సినిమాలు నిరాశ పర్చడంతో చేసేది ఏమీ లేక ఈ సినిమానే జనాలు చూస్తున్నారు.

విడుదల అయిన మూడు వారాల తర్వాత కూడా క్రాక్‌ థియేటర్ల సంఖ్య భారీగా ఉంది.దానికి తోడు సినిమా వసూళ్లు కూడా బాగానే ఉన్నాయి.50 శాతం ఆక్యుపెన్సీ కనుక ఇప్పటికి చాలా చోట హౌస్‌ ఫుల్‌ బోర్డులు కనిపిస్తున్నాయి.ఇక నిన్న నేడు భారీ ఎత్తున బుకింగ్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం హీరో రవితేజ ఈ సక్సెస్‌ ను ఎంజాయ్‌ చేస్తూ ఖిలాడీ సినిమాలో నటిస్తున్నాడు.సమ్మర్ లో నే ఆ సినిమాను విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు.

రమేష్‌ వర్మ దర్శకత్వంలో ఆ సినిమా రూపొందబోతుంది.క్రాక్‌ తరహాలోనే పక్కా కమర్షియల్‌ ఎంటర్‌ టైనర్‌ గా సినిమా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

క్రాక్‌ సినిమా సక్సెస్ తో దర్శకుడు గోపీచంద్‌ మలినేని ఫుల్‌ బిజీ అయ్యాడు.ఈ సంవత్సరంకు మంచి బిగినింగ్ ఇచ్చినందుకు ఇండస్ట్రీ మొత్తం రవితేజ గోపీచంద్‌ మలినేనికి కృతజ్ఞతలు చెబుతున్నారు.

#KrackMovie #RaviTeja #Ravi Teja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు