ఆయన కోసం బన్నీ, రవితేజ ఫైట్‌

అల్లు అర్జున్‌, రవితేజల మద్య ఫైట్‌ ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా? వీరిద్దరు డైరెక్ట్‌గా తపడటం లేదు, అలాగని తమ తమ సినిమాలతో బాక్సాఫీస్‌ ముందు ఢీ కొట్టడం లేదు.వీరిద్దరు కూడా ప్రస్తుతం ఒక దర్శకుడి కోసం ఫైట్‌ చేస్తున్నారు.

 Ravi Teja And Allu Arjun Fight For Vianand-TeluguStop.com

ఆ దర్శకుడితో నేను సినిమా చేస్తా అంటే నేను సినిమా చేస్తాను అంటూ తమ శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నాడు.ఇంతగా వీరు ఫైట్‌ చేస్తున్న ఆ దర్శకుడు ఎవరు అయ్యి ఉంటారని అనుకుంటున్నారా.

ఆయన మరెవ్వరో కాదు విఐ ఆనంద్‌.ఈ విభిన్న చిత్రాల దర్శకుడి దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఆ ఇద్దరు ప్రస్తుతం పోటీ పడుతున్నారు.

ఇద్దరిలో ఈయన ఎవరితో ముందు సినిమా చేస్తాడా అని సినీ వర్గాల వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అల్లు అర్జున్‌ ఇటీవలే ‘నా పేరు సూర్య’ చిత్రంతో తీవ్రంగా నిరాశ పర్చాడు.దాంతో తర్వాత సినిమా చాలా విభిన్నంగా ఉండటంతో పాటు, ప్రేక్షకులను థ్రిల్‌ చేసే విధంగా ఉండాలని భావిస్తున్నాడు.అందుకోసం విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న విఐ ఆనంద్‌తో సినిమా చేయాలని కోరుకుంటున్నాడు.

ఆనంద్‌ దర్శకత్వంలో అల్లు శిరీష్‌ హీరోగా తెరకెక్కిన ‘ఒక్క క్షణం’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ఒక్క క్షణం చిత్రం సమయంలోనే అల్లు అర్జున్‌తో ఆనంద్‌కు పరిచయం ఏర్పడటం, ఇద్దరి మద్య సినిమాల గురించి చర్చ రావడం, ఆ సమయంలోనే ఒక స్టోరీ లైన్‌ చెప్పడం జరిగింది.

ఆ స్టోరీతో సినిమా చేయాలని ఇప్పుడు అల్లు అర్జున్‌ కోరుకుంటున్నాడు.

మరో వైపు ‘ఒక్క క్షణం’ చిత్రం తర్వాత స్టోరీలు పట్టుకుని ఇద్దరు ముగ్గురు హీరోల వద్దకు వెళ్లిన విఐ ఆనంద్‌కు ఆ సమయంలో నిరాశ ఎదురైంది.

ఆ సమయంలోనే రవితేజ వద్దకు వెళ్లగా ఒక స్టోరీకి ఓకే చెప్పాడు.ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తి చేసిన తర్వాత తప్పకుండా చేద్దాం అంటూ హామీ ఇచ్చాడు.

దాంతో రవితేజ కోసం స్క్రిప్ట్‌ను రెడీ చేసే పనిలో ఉన్నాడు.ఆనంద్‌పై నమ్మకంతో రవితేజ కూడా అమర్‌ అక్బర్‌ ఆంటోనీ సినిమా పూర్తి అయిన తర్వాత ఆయన దర్శకత్వంలో చేయాలని కోరుకుంటున్నాడు.

ఇలాంటి సమయంలో ఆనంద్‌తో బన్నీ సంప్రదింపులు జరపడం రవితేజకు ఆగ్రహంను తెప్పిస్తుంది.

తనతో సినిమా చేస్తానంటూ హామీ ఇచ్చిన ఆనంద్‌ను మెల్లగా తన వైపుకు మరల్చుకునే ఆలోచనలో బన్నీ ఉన్నాడంటూ రవితేజ సన్నిహితుల వద్ద చెబుతు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.

వచ్చిన మెగా ఆఫర్‌ను కాదనలేక విఐ ఆనంద్‌ బన్నీతోనే సినిమా చేయాలని ఫిక్స్‌ అయ్యాడు.రెండు మూడు నెలల్లో బన్నీ హీరోగా ఆనంద్‌ దర్శకత్వంలో ఒక సినిమా మొదలు కాబోతుంది.

రవితేజను ఒప్పించేందుకు ఆనంద్‌ ప్రయత్నిస్తున్నాడు.అమర్‌ అక్బర్‌ ఆంటోని సినిమా పూర్తి అయ్యి, విడుదల అయ్యే లోపు బన్నీతో సినిమా పూర్తి చేస్తానంటూ ఆనంద్‌ హామీ ఇస్తున్నాడు.

కాని రవితేజ మాత్రం మొదట తనతోనే సినిమా చేయాలని కోరుతున్నాడు.మొత్తానికి అల్లు అర్జున్‌, రవితేజలు ఇద్దరు కూడా ఒకే దర్శకుడి కోసం ఫైట్‌ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube