ఎన్టీవీతో చేతులు క‌లుపుతోన్న టీవీ-9 ర‌విప్ర‌కాష్‌

తెలుగు ఎల‌క్ట్రానిక్ మీడియా రంగంలో టీవీ-9 క్రియేట్ సంచ‌ల‌నాలు అన్నీ ఇన్నీ కావు.ఇన్వెస్ట్‌గేష‌న్ జ‌ర్న‌లిజాన్ని స‌రికొత్త పుంత‌లు తొక్కించిన టీవీ-9 ఆ త‌ర్వాత ఎన్ని టీవీ ఛానెల్స్ వ‌చ్చినా టాప్ ప్లేస్‌లోనే కంటిన్యూ అవుతోంది.టీవీ-9 ఆ రేంజ్ బ్రాండింగ్ తీసుకొచ్చిన ఘ‌త‌న ఖచ్చితంగా ర‌విప్ర‌కాష్‌కే ద‌క్కుతుంది.ఇప్పుడు ర‌విప్ర‌కాష్ గురించి ఓ సంచ‌ల‌న వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది.టీవీ-9 క్రేజ్ ద‌శ‌దిశ‌లా వ్యాప్తి చెంద‌డంలో ఎంతో కృషి చేసిన ఆయ‌న టీవీ-9కు గుడ్ బై చెప్ప‌నున్నార‌ట‌.

 Ravi Prakash Says Goodbye To Tv9-TeluguStop.com

ఈ కొత్త ఆర్థిక సంవ‌త్స‌రం నుంచి టీవీ-9 మేనేజ్‌మెంట్ చేతులు మారుతున్న‌ట్టు స‌మాచారం.

గ‌తంలోనే టీవీ-9ను మైహోమ్ రామేశ్వ‌ర‌రావుకు అమ్మేస్తున్నార‌ని ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌చ్చాయి.అయితే అవేమి నిజం కాలేదు.

చాలా రోజులుగా టీవీ-9 ప్ర‌మోట‌ర్ శ్రీనిరాజు ఈ సంస్థ‌ను అమ్మేందుకు చేస్తోన్న ప్ర‌య‌త్నాలు ఎట్ట‌కేల‌కు ఓ కొలిక్కి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

ఇక టీవీ-9 నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే ర‌విప్ర‌కాష్ ఓ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛానెల్‌ను స్టార్ట్ చేసే ప్లాన్‌లో ఉన్నార‌ట‌.

ఆయ‌న గ‌త కొద్ది రోజులుగా ఎన్టీవీ ఆఫీస్‌లో త‌న‌కు ప్ర‌త్యేకంగా కేటాయించిన ఛాంబ‌ర్‌లో ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛానెల్ ఏర్పాట్ల‌పై క‌స‌ర‌త్తులు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.వీరికి మ‌రికొంత మంది ప్ర‌మోట‌ర్లు కూడా తోడ‌వుతార‌ని తెలుస్తోంది.

వీరు ముందుగా ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛానెల్‌ను ఓ కొలిక్కి తీసుకువ‌చ్చి.ఆ త‌ర్వాత ఎన్టీవీని నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్‌లో నిల‌బెట్టేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నార‌ట‌.

ఇక ముందు తేజ ఛానెల్, ఆ త‌ర్వాత 2002లో టీవీ-9 ప్రారంభం నుంచి ఆ ఛానెల్ నెంబ‌ర్ వ‌న్ ర్యాంకులో ఎంతో కీ రోల్ పోషిస్తోన్న ర‌విప్ర‌కాష్ ఆ ఛానెల్ నుంచి ఎందుకు బ‌య‌ట‌కు రావాల‌నుకుంటున్న‌దానిపై కార‌ణాలు మాత్రం తెలియ‌డం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube