ఆ షో లో సీరియల్ నటిని ముద్దు పెట్టుకున్న రవికృష్ణ....!

ఈ మధ్యకాలంలో తెలుగు బుల్లితెర పై కొన్ని హద్దులు మీరిన సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి.బుల్లితెరపై ప్రసారమవుతున్న కొన్ని సీరియల్స్ లో అక్కడక్కడా సన్నివేశాలు బోల్డ్ గా సాగుతున్నాయి.

 Serial Actor Ravi Krishna Kisses Navya Swamy In Cash Show, Ravi Krishana, Cash P-TeluguStop.com

కేవలం పాటలకు, సరదాకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటున్న ఢీ, క్యాష్ అండ్ ఎంటర్టైన్మెంట్ షోలలో రొమాన్స్ శృతి మించి పోతోంది.ఈ మధ్య కాలంలో క్యాష్ షో ని మరింత పాపులర్ చేయడానికి కొన్ని జంటలను పిలిపించి షో ని నిర్వహిస్తున్నారు.

ఇలా షో జరుగుతున్న సమయంలో అక్కడికి వచ్చిన జంటల మధ్య రొమాన్స్ హాట్ హాట్ గా సాగుతోంది.అయితే తాజాగా జరిగిన క్యాష్ ప్రోగ్రాం లో బుల్లితెర నటుడు రవి కృష్ణ, అలాగే బుల్లితెర నటి నవ్య స్వామి, ప్రణవి, శివజ్యోతి గెస్ట్ లుగా వచ్చారు.

ఇకపోతే ప్రస్తుతం మా టీవీలో ప్రసారమయ్యే ఓ సీరియల్ లో రవి కృష్ణ, నవ్య స్వామి భార్య భర్తలు గా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.వారిద్దరూ ఆ సీరియల్లో భార్యాభర్తలుగా నటించిన ఎక్కడ కూడా వారి హద్దులు దాటకుండా నటిస్తున్నారు.

అయితే క్యాష్ షో కి వచ్చిన వారిద్దరూ మాత్రం రొమాన్స్ ను పీక్ స్టేజ్ కి తీసుకెళ్లారు.క్యాష్ షో లో భాగంగా యాంకర్ సుమ టాస్క్ లు ఇవ్వగా వారిద్దరు మాత్రం అందులో భాగంగా రకరకాల ఫీట్లు చేస్తూ, టాస్క్ లో భాగంగా రవి కృష్ణ ఏకంగా నవ్య స్వామి కి ముద్దు పెట్టేశాడు.

అయితే క్యాష్ సెట్ లో షూటింగ్ అండ్ హడావిడి చేసిన యాంకర్ సుమ అందుకు తగ్గట్టుగా రవి కృష్ణ, నవ్య స్వామి కి అప్పగించింది.అయితే ఆ సమయంలో రవికృష్ణ ఇప్పుడు ఏం చేయాలి అని అడగగా నటన చేయాలంటూ కౌంటర్ ఇచ్చింది.

ఇక అంతే దాంతో రవి కృష్ణ, నవ్య స్వామి రెచ్చిపోయారు.ఇందులో భాగంగానే నవ్య స్వామి మోకాళ్ళమీద కూర్చొని ఐలవ్ యూ అని రవి కృష్ణ కి ప్రపోజ్ చేయగా వెంటనే రవికృష్ణ వచ్చి ఆవిడ నుదుటిపై ముద్దు పెట్టేసాడు.

దీంతో అక్కడే ఉన్న సుమ షాక్ కు గురై ఈ టాస్క్ నేను ఇవ్వలేదంటూ హడావిడి చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube