రవి కృష్ణ ఫోటోపై అలా కామెంట్ చేసిన దీప్తి సునయన... దాంతో పొట్టి అంటూ....

పలు తెలుగు సీరియల్లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రల్లో నటించి బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టాలీవుడ్ ప్రముఖ సీరియల్ నటుడు రవి కృష్ణ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే నటుడు రవి కృష్ణ ఆ మధ్య తెలుగులో ప్రముఖ రియాల్టీ గేమ్ షో అయిన బిగ్ బాస్ మూడవ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని ప్రేక్షకులని బాగానే అలరించాడు.

 Ravi Krishna Funny Reply To The Deepthi Sunaina, Deepthi Sunaina, Ravi Krishna,-TeluguStop.com

దీంతో రవి కృష్ణ సినీ కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది.కాగా ప్రస్తుతం పలు ఈవెంట్లు, షోలలో నటిస్తూ బాగానే సంపాదిస్తున్నాడు.

అయితే ఈ మధ్య కాలంలో నటుడు రవి కృష్ణ సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తన అభిమానులతో పంచుకున్నాడు.ఈ క్రమంలో తాజాగా రవి సిక్స్ ప్యాక్ బాడీ ని చూపిస్తూ ఓ ఫోటోని షేర్ చేశాడు.

దీంతో కొందరు రవి కృష్ణ అభిమానులు సినిమాల్లో హీరోగా ట్రై చెయ్యండంటూ కామెంట్లు చేస్తున్నారు.అయితే ఈ ఫోటో పై మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ దీప్తి సునయన కూడా కష్టానికి తగ్గ ఫలితం అంటూ కామెంట్ చేసింది.

దీంతో రవి కృష్ణ థాంక్స్ పొట్టి అంటూ రిప్లై ఇచ్చాడు.అయితే మరో సీరియల్ హీరోయిన్ రోహిణి కూడా హాట్ ఆంటీ కామెంట్ చేసింది.

దీంతో రవి కృష్ణ తనదైన శైలిలో స్పందిస్తూ థాంక్స్ అక్కో.అంటూ సరదాగా రిప్లై ఇచ్చాడు.

Telugu Bigg Boss, Deepthi Sunaina, Ravi Krishna, Ravikrishna, Telugu Serial-Movi

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రవి కృష్ణ ఒకపక్క సీరియళ్లలో నటిస్తూనే మరో పక్క సినిమాల్లో హీరోగా అవకాశాలు దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.అయితే ఈ మధ్యకాలంలో నటుడు రవి కృష్ణ కి తెలుగు సీరియళ్లలో హీరోయిన్ గా నటిస్తున్న ఓ సీరియల్ హీరోయిన్ కి మధ్య ప్రేమాయణం నడుస్తోందని తొందర్లోనే వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని పలు వినిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube