జయా బచ్చన్ కి కౌంటర్ ఇచ్చిన రేసుగుర్రం విలన్  

Ravi Kishan\'s response to Jaya Bachchan\'s criticism, Bollywood, Bollywood Drugs Mafia, Drugs Mafia, Ravi Kishan, Jaya Bachchan - Telugu Bollywood, Bollywood Drugs Mafia, Drugs Mafia, Jaya Bachchan, Ravi Kishan, Ravi Kishan\\'s Response To Jaya Bachchan\\'s Criticism

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు డ్రగ్స్ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది.సుశాంత్ ఆత్మహత్య కేసు విచారణ చేస్తే బాలీవుడ్ లో డ్రగ్స్ మాఫియా భాగోతాలు బయట పడ్డాయి.

TeluguStop.com - Ravi Kishans Response To Jaya Bachchans Criticism

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

దీంతో ఇప్పుడు ఆ దిశగా ఎన్సీబీ పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.ఈ కేసులో రియా చక్రవర్తిని విచారిస్తూ ఆమె ద్వారా మొత్తం డొంకని లాగేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

TeluguStop.com - జయా బచ్చన్ కి కౌంటర్ ఇచ్చిన రేసుగుర్రం విలన్-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇదిలా ఉంటే ఈ డ్రగ్స్ వ్యవహారంపై సినీ నటుడు, రేసుగుర్రం విలన్, బీజేపీ ఎంపీ రవి కిషన్ లోక్ సభలో మాట్లాడారు.చిత్ర పరిశ్రమ డ్రగ్స్ మత్తులో జోగుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలపై అమితాబ్ బచ్చన్ భార్య, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ రాజ్యసభలో మాట్లాడుతూ రవికిషన్ వ్యాఖ్యలను తప్పుపట్టారు.కొందరు చేసిన తప్పులకు సినీపరిశ్రమ మొత్తానికి ఆపాదించడం సరికాదని ఆమె అన్నారు.

సినీ పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని వ్యాఖ్యానించారు.ఇండస్ట్రీలో ఉంటూ ఇండస్ట్రీ మీద బ్రతికే వాళ్ళే బాలీవుడ్ ని తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించింది.

దీనిపై కంగనా ట్విట్టర్ లో జయ బచ్చన్ కి కౌంటర్ ఇచ్చింది.మీ కొడుకు డ్రగ్స్ కి బానిస అయితే మీరు ఇలాగే మాట్లాడుతారా, మీ కూతురుని ఇండస్ట్రీలో ఇలాగే వేధిస్తే మీరు ఇవే మాటలు చెబుతారా అంటూ ప్రశ్నించింది.

మరో వైపు రవికిషన్ కూడా జయాబచ్చన్ వ్యాఖ్యలపై పార్లమెంటు బయట మీడియాతో మాట్లాడుతూ మండిపడ్డారు.తన అభిప్రాయాన్ని జయాబచ్చన్ గౌరవించాలని చెప్పారు.తాను ఒక ప్రీస్ట్ కుమారుడినని, ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో ఎదిగానని, దాదాపు 600 సినిమాలకు పని చేశానని అన్నారు.తన అభిప్రాయాలకు జయ మద్దతు ఇస్తారని భావిస్తున్నానని చెప్పారు.

ప్రపంచంలోనే అతి పెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీని నాశనం చేస్తున్న వారి గురించి తాను మాట్లాడానని తెలిపారు.పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు.

అయితే ఈ విమర్శల పర్వం ఇక్కడితో ఆగుతుందా, దానికి రాజికీయ రంగు అద్దుకొని మరింత తీవ్రతరం అవుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

.

#BollywoodDrugs #RaviKishan's #Drugs Mafia #Jaya Bachchan #Ravi Kishan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ravi Kishans Response To Jaya Bachchans Criticism Related Telugu News,Photos/Pics,Images..