బిగ్‌బాస్‌ : రవి ఔట్‌, అలీ రీ ఎంట్రీ నిజమా?

తెలుగు బిగ్‌బాస్‌ 10 వారాలకు చేరుకుంది.సీజన్‌ సగం పూర్తి అయ్యింది.

 Ravi Kiran Out In Bigg Is Confirmed For Next Week 10-TeluguStop.com

ఇప్పటికే ఇద్దరు వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చి, బయటకు వచ్చేశారు.ఇప్పుడు మూడవ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఉండబోతుంది అంటూ ప్రచారం జరుగుతోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ రీ ఎంట్రీగా ఉండబోతుందట.అంటే రెండు వారాల క్రితం ఎలిమినేట్‌ అయిన అలీ రెజాను ఇంట్లోకి రీ ఎంట్రీ ఇప్పించేందుకు స్టార్‌ మా సిద్దం అయ్యింది.

గత సీజన్‌లో నూతన్‌ నాయుడు మరియు శ్యామలలు రీ ఎంట్రీ ఇచ్చారు.ఈసారి అలీ రెజా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

Telugu Ali Reza, Punarnavi, Rahul, Ravi Kiran, Srimukhi, Varun-

అలీ రెజా ఎలిమినేషన్‌ విషయంలో చాలా విమర్శలు వ్యక్తం అయ్యాయి.అసలు అలీ ఫైనల్‌ వరకు ఉంటాడు,ఆయనే టైటిల్‌ విన్నర్‌ అయ్యి ఉంటాడు అని అంతా అనుకున్నారు.కాని అనూహ్యంగా ఆయన ఎందుకు ఇలా ఎలిమినేట్‌ అయ్యాడు అంటూ అవాక్కయ్యారు.అలీని మళ్లీ హౌస్‌లోకి పంపించాల్సిందే అంటూ చాలా మంది డిమాండ్‌ చేస్తున్నారు.బలమైన కంటెస్టెంట్స్‌ అంతా బయటకు వచ్చేస్తున్నారు.ఆటపై ఆసక్తి కోల్పోతున్నాం అంటూ ప్రేక్షకులు డిమాండ్‌ చేసిన నేపథ్యంలో చివరకు అలీని రీ ఎంట్రీ ఇప్పించబోతున్నారు.

ఈవారం ఎలిమినేషన్‌కు నామినేట్‌ అయిన నలుగురిలో శ్రీముఖి మరియు వరుణ్‌లు సేఫ్‌ అవుతారు.రవి మరియు బాబా భాస్కర్‌లో రవి ఎలిమినేట్‌ అయ్యే అవకాశం ఉందని, బాబా భాస్కర్‌ కొద్ది ఓట్ల తేడాతో సేవ్‌ అయ్యే అవకాశం ఉంది అంటూ టాక్‌ వినిపిస్తుంది.

రవి ఎలిమినేట్‌ అయిన వెంటనే అలీ రీ ఎంట్రీ ఉండబోతుంది.మొత్తానికి చివరి వారాల్లో అయినా షోను ఆసక్తికరంగా సాగించాలని, మంచి రేటింగ్‌ను దక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో స్టార్‌ మా వారు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు.

మరి వారి ప్రయత్నాలు ఎంత వరకు వర్కౌట్‌ అయ్యేనో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube