పార్టీ మారారో లేదో అప్పుడే మొదలెట్టేశారు  

Ravela Sensational Comments On Pawan Kalyan-janasena,narendra Modi,pawan Kalyan,ravela,tirupathi,ysrcp,వైసీపీ

రాజకీయ నేత అంటేనే పది నాలుకలు ఉండేవాడు అని అర్ధం. ఎందుకంటే ఎప్పుడు ఏ పార్టీ కండువా కప్పుకుంటే ఆ పార్టీ కి అనుకూలంగా మాట్లాడడం రాజకీయ నేత నైజం. సరిగ్గా ఇదే పద్దతి పాటిస్తున్నారు మాజీ జనసేన నేత రావెల కిషోర్ బాబు..

పార్టీ మారారో లేదో అప్పుడే మొదలెట్టేశారు -Ravela Sensational Comments On Pawan Kalyan

ఇటీవల వ్యక్తిగత కారణాల వల్ల పార్టీ కి రాజీనామా చేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే జనసేనకు గుడ్ బై చెప్పిన రావెల ఇప్పుడు తాజాగా బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన జనసేనాని పై సంచలన ఆరోపణలు చేశారు.

జనసేనాని పవన్ తనకు పార్టీ లో సరైన స్థానం ఇవ్వలేదని,తానూ జనసేన కీలక నేతల్లో ఒకడిని అంటూ జరిగిన ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కిషోర్ బాబు ఆరోపించారు. కనీసం ఆయన అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేవారని,నాకు అసలు ప్రాధాన్యమే ఇవ్వలేదంటూ వాపోయారు. తిరుపతిలో ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్న రావెల కిషోర్ బాబు ఆ తర్వాత గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ పవన్ పై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

పైకి సన్నిహితంగా అనిపించినా, ఆయన అంత సన్నిహితంగా మెలిగే వ్యక్తి కాదని పవన్‌పై విమర్శల వర్షం కురిపించారు. ఇక రాజకీయ వ్యూహాలపై చర్చించేందుకు కూడా తనకు ఏ రోజు అవకాశం ఇవ్వలేదంటూ ఆరోపించారు. అలా పార్టీ మారేరో లేదో ఇలా రావెల జనసేన పార్టీ పై ఆరోపణలు చేసారు.

ఈ విధంగా రాజకీయ నేతలు పార్టీ మారగానే ముందర ఉన్న పార్టీలపై ఆరోపణలు చేసే విషయం తెలిసిందే. గతంలో టీడీపీ లో ఉన్న ముఖ్య నేత రోజా, అక్కడ నుంచి వైసీపీ లో చేరిన విషయం విదితమే. టీడీపీ లో ఉండగా వైసీపీ పై దుర్భాషలాడుతూ వ్యాఖ్యలు చేసిన రోజా,ఇప్పుడు వైసీపీ లో ఉండి టీడీపీ పై దుమ్మెత్తిపోస్తుంది.

ఇలా రాజకీయ నేతలు ఏ పార్టీ లోకి మారితే ఆ పార్టీ ని పొగడకుండా మానరు,అలానే గత పార్టీ ని తిట్టకుండా మానరు.