తన స్వార్ధం కోసమే పార్టీ మారినట్లు ఒప్పుకున్న రావెల కిషోర్ బాబు  

జనసేన పార్టీ వీడటానికి అధికారంలోకి రాకపోవడమే కారణం అన్న రావెల కిషోర్ బాబు. .

Ravela Kishore Babu Says Reason For Change The Party-janasena,pawan Kalyan,ravela Kishore Babu,reason For Change The Party,tdp

ఏపీ రాజకీయాలలో జనసేన పార్టీ స్థాపించి తమ ఇమేజ్ తో రాజకీయాలలో ప్రభావం చూపించాలని ప్రయత్నం చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తాజా ఎన్నికలలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికలలో కేవలం ఒక్క స్థానంకి జనసేన పరిమితం అయిపొయింది. ఇదిలా ఉంటే ఎన్నికలలో ఓటమి తర్వాత జనసేన పార్టీలోకి వచ్చిన చాలా మంది నేతలు పార్టీ మారేందుకు సిద్ధం అయిపోతున్నారు..

తన స్వార్ధం కోసమే పార్టీ మారినట్లు ఒప్పుకున్న రావెల కిషోర్ బాబు-Ravela Kishore Babu Says Reason For Change The Party

తాజాగా టీడీపీలో మంత్రిగా చేసి ఎన్నికల ముందు జనసేన పార్టీలో చేరిన రావెల కిషోర్ బాబు జనసేన పార్టీకి రాజీనామా చేసి మోడీ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరాడు.అయితే వ్యక్తిగత కారణాలతో పార్టీని వీడుతున్నట్లు ముందుగా చెప్పిన రావెల కిషోర్ బాబు మరుసటి రోజే బీజేపీలో చేరడం సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే బీజేపీలో చేరిన తర్వాత జనసేన పార్టీని వీడటానికి కారణాలని రావెల కిషోర్ బాబు చెప్పుకొచ్చారు.

జనసేన పార్టీ పెట్టి రాజకీయాలలో మార్పు తీసుకురావాలనే ప్రయత్నం పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు చాలా గొప్పవని, అవినీతి రహిత సమాజం, సరికొత్త రాజకీయాలు అనే అతని ఆలోచనలు గొప్పవే వాటిని సాధించాలంటే అధికారం ఉండాలని, అధికారం లేకుండా ఎన్ని ఆశయాలు ఉన్న వాటిని సాధించలేరని చెప్పుకొచ్చారు. ఇక రావెల మాటలబట్టి కేవలం తాను పార్టీ మారడానికి పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాకపోవడమే అని నేరుగా ఒప్పుకున్నట్లు అయ్యింది అని చెప్పాలి. మరి దీనికి పవన్ ఏం సమాధానం చెబుతాడు అనేది ఇప్పుడు చూడాలి.