అలాంటి వాళ్ళు ప్రతి చోట ఉంటారు. బీ కేర్ ఫుల్ అంటున్న రవీనా టాండన్  

Raveena Tandon opens up about the Nepotism, Sushant Singh Rajput, Bollywood, tollywood, Indian Cinema, South Cinema - Telugu Bollywood, Indian Cinema, Raveena Tandon Opens Up About The Nepotism, South Cinema, Sushant Singh Rajput, Tollywood

ఎదిగే క్రమంలో తమ కెరియర్ ని దెబ్బతీసేందుకు ప్రయత్నించే వారు సమాజంలో చాలా మంది ఉంటారని, అలాంటి వారి నుంచి వీలైనంత జాగ్రత్తగా ఉండాలని బాలీవుడ్‌ హీరోయిన్ రవీనా టండన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.గత కొంత కాలంగా బాలీవుడ్ లో నెపోటిజం గురించి తీవ్ర చర్చ నడుస్తుంది.

 Raveena Tandon Nepotism Sushant

వారసత్వ నటులు కొత్తవాళ్లకి అవకాశాలు లేకుండా చేస్తున్నారని విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.సుశాంత్ మరణానికి ఇవే కారణం అని వాదిస్తున్నారు.

ఈ వాదనపై తాజాగా రవీనా టాండన్ స్పందించింది.నెపోటిజం, దెబ్బతీసే ప్రయత్నాలు చేయడం కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని రంగాల్లోనూ సర్వ సాధారణమని ఆమె పేర్కొన్నారు.

అలాంటి వాళ్ళు ప్రతి చోట ఉంటారు. బీ కేర్ ఫుల్ అంటున్న రవీనా టాండన్-Movie-Telugu Tollywood Photo Image

ఇండస్ట్రీలో తను స్వయంగా ఎదుర్కొన్న అనుభవాలని ఈ సదర్భంగా చెప్పుకొచ్చారు.బాలీవుడ్‌లో నెపోటిజమ్‌ ఉంది.అందుకు నేను అంగీకరిస్తున్నాను.ప్రతి చోట మంచి వ్యక్తులు, చెడ్డ వ్యక్తులు ఉన్నారు.

వీరిలో చెడ్డవాళ్లు మన ఎదుగుదలని దెబ్బ తీసే ప్రయత్నం చేస్తూనే ఉంటారు.నాకు కూడా ఈ అనుభవం ఎదురైంది.

మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్లు మిమ్మల్ని ఎప్పుడూ దెబ్బతీసేందుకు, సినిమాల నుంచి తప్పించేందుకు ఎదురు చూస్తుంటారు.ప్రతి పరిశ్రమలోనూ ఇలాంటి వ్యక్తులు ఉంటారు.

అయితే మేము గ్లామర్‌ ఇండస్ట్రీలో ఉన్నాము కాబట్టి ఇది ఎక్కువ హైలెట్‌ అవుతోంది.సుశాంత్ మరణంపై అతిగా ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదు అంటూ రవీనా కామెంట్స్ చేసింది.

ఈమె చేసిన వాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Raveena Tandon Nepotism Sushant Related Telugu News,Photos/Pics,Images..