కుమార్తెను తెర‌కు ప‌రిచ‌యం చేస్తున్న ర‌వీనా టాండ‌న్‌

Raveena Tandon Is Introducing Her Daughter To The Screen ,Raveena Tandon ,Rasha Tadani,Aman Devgan,Black Belt In Taekwondo,Ranbir,Bollywood Actress Raveena Tandon, Abhishek Kapoor,Rasha,Film Distributor Anil Tadanini

బాలీవుడ్ నటి రవీనా టాండన్ 1995వ సంవత్సరంలో పూజ మరియు ఛాయ అనే ఇద్దరు కుమార్తెలను దత్తత తీసుకున్నారు.సింగిల్ మదర్ అయిన తర్వాత, రవీనా 2004లో ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానిని వివాహం చేసుకుంది.

 Raveena Tandon Is Introducing Her Daughter To The Screen ,raveena Tandon ,rasha-TeluguStop.com

తరువాత రాషా మరియు రణబీర్ అనే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది.అభిషేక్ కపూర్ తదుపరి చిత్రంతో రవీనా 17 ఏళ్ల కుమార్తె రాషా తడానీ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం.

ఈ చిత్రంలో అజయ్ దేవగన్ మేనల్లుడు అమన్ దేవగన్ రాషాతో కలిసి కనిపించనున్నారు.ప్రస్తుతానికి, ఈ చిత్రానికి ఇంకా పేరు ఖరారు కాలేదు కానీ ఈ చిత్రంలో అజయ్ దేవగన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తాడని, పూర్తిగా కొత్త రూపంలో కనిపించనున్నాడని చెబుతున్నారు.

యాక్షన్‌ అడ్వెంచర్‌ చిత్రంగా ఇది రూపొందనుంది.

Telugu Abhishek Kapoor, Ajay Devgn, Aman Devgan, Blackbelt, Anil Tadanini, Ranbi

టైక్వాండోలో బ్లాక్ బెల్ట్ రవీనా కూతురు రాషా లుక్‌లో చాలా అందంగా ఉంది.ఆమెకు తల్లి రవీనా మద్దతు పూర్తిగా ఉంది.రాషా మార్చి 16, 2005న జన్మించింది.

రాషా 2021లో ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి IGCSE (ఇంటర్నేషనల్ జనరల్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది.రాషా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

రాషా మొదట్లో పాటలు పాడుతూ, సంగీత వాయిద్యాలను వాయిస్తూ చాలా వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.రాషాకు తైక్వాండోలో బ్లాక్ బెల్ట్ కూడా ఉంది.

తల్లి రవీనా టాండన్‌తో కలిసి రాషా తరచూ ఫోటోలను పంచుకుంటుంది.అమన్ అజయ్ దేవగన్ సోదరి నీలం దేవగన్ కుమారుడు.

Telugu Abhishek Kapoor, Ajay Devgn, Aman Devgan, Blackbelt, Anil Tadanini, Ranbi

రవీనా టాండన్ మరియు అజయ్ దేవగన్ 90లలోని హిట్ పెయిర్‌లలో ఒకరుగా నిలిచారు.ఇప్పుడు ఈ నటి కుమార్తె మరియు నటుడి మేనల్లుడు అమన్ ఒక చిత్రంతో పరిచయం అవుతున్నారు.ఇప్పుడు వీరిద్దరూ తెరపై ఎలా కనిపించోబున్నారనేది ఆసక్తికరంగా మారింది.వర్క్ ఫ్రంట్ గురించిన వివరాల్లోకి వస్తే, అజయ్ దేవగన్ త్వరలో రోహిత్ శెట్టి ‘సింగం ఎగైన్’లో కనిపించనున్నారు.

దీంతో పాటు ‘మైదాన్’, ‘భోలా’ వంటి భారీ చిత్రాలు కూడా ఆయన చేతిలో ఉన్నాయని సమాచారం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube