హైదరాబాద్ లో రేవ్ పార్టీ కలకలం... 20 మంది అరెస్ట్  

Rave Party In Jubilee Hills Pub-hyderabad,jubilee Hills Pub,police Ride,rave Party

మెట్రోపాలిటన్ నగరంలో దేశంలో ప్రముఖ పట్టణాల జాబితాలో ఉన్న హైదరాబాద్ లో విష సంస్కృతి కూడా అదే రేంజ్ లో వృద్ధి చెందుతుంది.లక్షలలో వచ్చే ఆదాయం, ఖరీదైన జీవితాలతో విలాసాలకి అలవాటు పడుతున్న యువత తప్పుడు పనులు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు.

Rave Party In Jubilee Hills Pub-hyderabad,jubilee Hills Pub,police Ride,rave Party Telugu Viral News Rave Party In Jubilee Hills Pub-hyderabad Jubilee Pub Police Ride Rave-Rave Party In Jubilee Hills Pub-Hyderabad Jubilee Pub Police Ride

ఒకప్పుడు నగర శివార్లులో డ్రగ్స్, రేవ్ పార్టీలు పెట్టుకుంటూ దొరికిన పరిస్థితి హైదరాబాద్ లో కనిపించింది.ఇక టాలీవుడ్ లో డ్రగ్స్ ర్యాకెట్ ఎంత కలకలం రేపిందో అందరికి తెలిసిందే.

అయితే ఈ మధ్య కాలంలో అలాంటి అసాంఘిక కార్యకలాపాలు పెద్దగా జరగలేదని పోలీసులు కూడా కాస్తా ఊపిరి పీల్చుకుంటున్నారు.ఇలాంటి పరిస్థితిలో ఊహించని విధంగా సిటీ నడిఒడ్డులో రేవ్ పార్టీ కలకలం రేపింది.

జూబ్లీహిల్స్‌లో టాట్ పబ్ ఈ రేవ్ పార్టీకి కేంద్రం అయ్యింది.అయితే దీనిని పోలీసులు చాకచక్యంగా భగ్నం చేశారు.ఈ రేవ్ పార్టీలో అశ్లీల నృత్యాలు చేస్తున్న 20 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు.పబ్‌లో యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారనే సమాచారంతో దాడి చేశారు.

దాడి సమయంలో అశ్లీల నృత్యాలు చేస్తున్న యువతులు అదుపులోకి తీసుకున్నారు.వారిని పోలీస్ స్టేషన్ కి తరలించే ప్రయత్నంలో వారు మీడియా మీద దాడి చేశారు.

వీడియోలు షూట్ చేస్తున్న వారి మీద దాడి చేసి వారి ఫోన్స్ ని పగలగొట్టారు.వారి ఇష్టానుసారంగా దూషించారు.

పోలీసులు ఆ 20 యువతులని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.సిటీ నడిఒడ్డులో ఈ ఘటన జరగడం ఇప్పుడు మరో సంచలనంగా మారుతుంది.

.

తాజా వార్తలు