సీతని ఎత్తుకెళ్లిన రావణాసురుడు ఆమెను ఎందుకు ముట్టుకోలేదో  తెలుసా...?

రామాయణంలో రాముడు ఎంతగా పాపులర్ అయ్యాడో ఆయన భార్యని ఎత్తుకెళ్లినటువంటి రావణాసురుడు కూడా అంతే పాపులర్ అయ్యాడు.అయితే ప్రస్తుత కాలంలో కొందరు రాముడు కన్నా రావణాసురుడే గొప్పవాడు అంటూ కామెంట్లు చేస్తుంటారు.

 Ravana, Ravanusura, Sitha, Rama, Sriramanavami, Ramayanam, Lanka,-TeluguStop.com

అయితే అందుకు కారణం లేకపోలేదు.రావణాసురుడు సీతను బలవంతంగా ఎత్తుకెళ్లి ఆరు మాసాల పాటు తన లంక నివాసంలో ఉంచినప్పటికీ ఆమెను కనీసం తాక లేదని, కానీ  రాముడు మాత్రం రావణాసురుడి వధ జరిగిన తర్వాత సీతని అగ్నిలో ప్రవేశించి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాలని ఆమెని అగ్ని ప్రవేశం చేయిస్తాడు.

ఈ కారణంగా కొందరు రాముడికంటే రావణాసురుడు గ్రేట్ అంటూ వాదిస్తుంటారు.

అయితే రావణాసురుడు సీతను అపహరించి దాదాపుగా ఆరు మాసాలు తన నివాసం అయినటువంటి లంకలో ఉంచినప్పటికీ ఎందుకు తాకలేదనే విషయం ఇప్పటికీ చాలామందికి తెలియదు.

అయితే ఇప్పుడు ఆ విషయం ఏంటో ఒకసారి తెలుసుకుందాం.రావణాసురుడు దేవతల ఆహ్వానం మేరకు ఒకసారి ఇంద్రలోకానికి వెళతాడు.అయితే ఆ సమయంలో దేవలోక నర్తకి అయినటువంటి రంభ పై మనసు పారేసుకుంటాడు.దీంతో ఆమెను తన కోరిక తీర్చాలంటూ బలవంత పెట్టగా ఆమె అందుకు నిరాకరిస్తుంది.

అయినప్పటికీ రావణాసురుడు ఆమెను వదలకుండా బలవంతం చేయబోగా ఇదంతా గమనిస్తున్నటువంటి రంభ భర్త నలకుబేరుడు రావణాసురుడికి శాపం పెడతాడు.

అయితే ఇందులో ఇష్టం లేకుండా పర స్త్రీని తాకితే నీ తల వెయ్యి ముక్కలు అవుతుందని శాపం ఇస్తాడు.

దీంతో భయపడిన రావణాసురుడు అక్కడనుంచి వెళ్ళి పోతాడు.అయితే అప్పటి నుంచి రావణాసురుడు ఇష్టం లేకుండా పర స్త్రీని తాకాలంటే భయపడుతుంటాడు.అందువల్లనే సీతను అపహరించి సమయంలో కూడా ఆమెను ముట్టుకోకుండా ఆమె నిలబడినటువంటి భూమిని పెకలించి తీసుకువెళతాడు.నల కుబేరుడు ఇచ్చినటువంటి శాపం కారణంగా నే రావణాసురుడు సీతను బలవంతంగా ముట్టుకోలేదు మరియు అటువంటి ప్రయత్నం కూడా చేయలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube