రేషన్ కార్డు నెంబర్ చెప్పి వేలిముద్ర వేయగానే డీలర్లు లబ్ధిదారులకు కావలసిన బియ్యం సహ తదితర సరుకులు అందించేవారు.కానీ వేలిముద్ర విధానానికి తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం వీడ్కోలు పలుకుతోంది.
రేషన్ దుకాణాల వద్ద బయోమెట్రిక్ పద్ధతి ని పూర్తిగా తీసేస్తుంది.దానికి బదులు ఓటీపీ ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేయాలనే కొత్త విధానానికి శ్రీకారం చుడుతోంది.
వచ్చే నెల అనగా ఫిబ్రవరి నుంచి ఈ పద్ధతి అమలులోకి వస్తుందని తెలుస్తోంది.రేషన్ కార్డు నెంబర్ ని ఈపాస్ డివైస్ లో డీలర్ ఎంట్రీ చేయగానే వినియోగదారుని ఫోన్ కు ఓటీపీ వస్తుంది.
ఆ ఓటీపీ డీలర్ కి చెప్పి రేషన్ సరుకులు తీసుకోవాల్సి ఉంటుంది.
పౌరసరఫరాల శాఖ ఈ ఓటీపీ పద్ధతిని పకడ్బందీగా అమలు పరిచేందుకు ఇప్పటికే కసరత్తులు చేస్తోంది.ఆధార్ కార్డు తో వినియోగదారుల మొబైల్ నెంబర్ లింక్ అయిందో లేదో తెలుసుకోవాలని.ఒకవేళ మొబైల్ నెంబర్ ఇంకా ఆధార్ కార్డుతో లింక్ కాకపోతే మీ సేవ లేదా ఈ సేవా కి వెళ్లి ఆధార్ కార్డు తో మొబైల్ నెంబర్ లింక్ అప్ చేసుకోవాలని డీలర్లు సూచిస్తున్నారు.
అయితే బయోమెట్రిక్ విధానానికి స్వస్తి చెప్పడానికి ముఖ్య కారణం కరోనా వైరస్ అని తెలుస్తోంది.ఒకే డివైస్ ఫై చాలామంది వేలిముద్రలు వేయటం కారణంగా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని.
అందుకే ఓటీపీ విధానాన్ని తెరమీదకు తెచ్చారని తెలుస్తోంది.
కరోనా వైరస్ పూర్తిగా తగ్గుముఖం పడితే మళ్లీ బయోమెట్రిక్ విధానాన్నే కొనసాగిస్తారు.
కొత్త విధానం అమలులోకి వస్తుండడంతో ఫిబ్రవరి నెల నుంచి ఆధార్ తో మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉంటేనే రేషన్ సరుకులు పొందే ఆస్కారం ఉంటుందని లబ్ధిదారులు తెలుసుకోవాలి.గ్రేటర్ హైదరాబాద్ లో 30 శాతం మంది లబ్ధిదారుల ఫోన్ నెంబర్లు ఆధార్ తో లింకు కాలేదని సమాచారం.
అయితే ఆధార్ తో లింక్ చేయించుకొని లబ్ధిదారులు జనవరి నెల చివరి లోపు లింక్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది ప్రభుత్వం.
.