దారుణంగా పడిపోయిన వంటలక్క రేటింగ్.. ఈసారి టాప్ లో?

Rating For The Worst Dropped Karthika Deepam Top This Time

బుల్లితెరపై పలు ఛానల్స్ లలో ప్రసారమవుతున్న సీరియల్స్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.ఇందులో ఎక్కువగా స్టార్ మా మాత్రం ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.

 Rating For The Worst Dropped Karthika Deepam Top This Time-TeluguStop.com

అందులో ప్రసారమవుతున్న సీరియల్స్ ప్రేక్షకులను బాగా మెప్పిస్తున్నాయి.ముఖ్యంగా కార్తీకదీపం మాత్రం రేటింగ్ తో మొదటి స్థానంలో దూసుకుపోతుంది.

కానీ తాజాగా దారుణంగా రేటింగ్ పడిపోయింది.

 Rating For The Worst Dropped Karthika Deepam Top This Time-దారుణంగా పడిపోయిన వంటలక్క రేటింగ్.. ఈసారి టాప్ లో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గత కొన్ని రోజుల నుండి ఈ సీరియల్ ఒకటే కథను సాగదీయడంతో ప్రేక్షకులు ఈ సీరియల్ చూడటానికి అంతగా ఆసక్తి చూపట్లేదు.

దీంతో పూర్తిగా రేటింగ్ పడిపోయింది.అర్బన్ ప్రాంతంలో 40వ వారం రేటింగ్ 12.80 నమోదు కాగా రూరల్ ప్రాంతంలో 14.52 రేటింగ్ వచ్చింది.ఇక గుప్పెడంత మనసు రేటింగ్ ను బాగా పెంచుకుంటుంది.అర్బన్ లో 11.67 ఉండగా రూరల్ లో 13.53 రేటింగ్ నమోదయింది.

ఇంటింటా గృహలక్ష్మి సీరియల్ అర్బన్ ప్రాంతంలో 10.89 రేటింగ్ నమోదవ్వగా రూరల్ లో 12.03 రేటింగ్ సొంతం చేసుకుంది.ఇక జీ తెలుగు లో రాధమ్మ కూతురు సీరియల్ మొదటి స్థానంలో నిలిచింది.ఈ సీరియల్ తర్వాత నెంబర్ వన్ కోడలు, ప్రేమ ఎంత మధురం వరుసగా ఉన్నాయి.

ఈటీవీలో ప్రసారమవుతున్న సీరియల్స్ లలో మనసు మమత మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంది.

ఈ సీరియల్ తర్వాత నా పేరు మీనాక్షి, అత్తారింటికి దారేది సీరియల్స్ వరుసగా ఉన్నాయి.ఇక జెమిని ఛానల్ లో చాలావరకు ప్రసారమయ్యే సీరియల్ అంత రేటింగ్ సాధించలేవు.అలా వెంకటాపురం మాత్రం కొంతవరకు సాగుతుంది.

అన్ని ఛానల్స్ లలో కంటే స్టార్ మా మొదటి స్థానంలో నిలిచింది.ఆ తర్వాత జీ తెలుగు, ఈటీవీ, జెమినీ టీవీలు ఉన్నాయి.

#Nirupam #AthhaRintiki #Drbabu #Karthika Deepam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube