బిగ్ బాస్ ( Bigg Boss) సీజన్ 7 కార్యక్రమం రేపటితో నాలుగవ సీజన్ పూర్తి కానుంది.ఇలా ఈ కార్యక్రమం నాలుగవ సీజన్ పూర్తి కావడంతో మరొక కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు.
ఇక ఈ వారం నామినేషన్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్లలో అతి తక్కువ ఓట్లతో చివరిలో టేస్టీ తేజ ( Tasty Teja ) ఉన్నారని ఇదివరకు వార్తలు వచ్చాయిఈయన తర్వాత రతిక( Rathika ).అతి తక్కువ ఓట్లతో తరువాత స్థానంలో ఉంది.ఇక సోషల్ మీడియాలో బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యే కనిపిస్టెంట్ గురించి ముందుగానే లీక్ అవుతూ ఉంటుందనే సంగతి మనకు తెలిసిందే.ఇలా సోషల్ మీడియాలో వచ్చిన వార్తలకు అనుగుణంగానే ఇప్పటివరకు బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు.

ఇక ఈవారం టేస్టీ తేజ( Tasty Teja ) బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్ళిపోతారు అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం అయింది అయితే చివరిలో బిగ్ బాస్ ఊహించని విధంగా ట్విస్ట్ ఇచ్చారని బిగ్ బాస్ హౌస్ నుంచి టేస్టీ తేజ ఎలిమినేట్ కాకుండా రతికను ఎలిమినేట్ చేశారు అంటూ వార్తలు వస్తున్నాయి.ఇలా ఈ వారం కూడా మరొక లేడీ కంటెస్టెంట్ రతిక హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారని చెప్పాలి.రతిక ఎలిమినేట్ అయ్యారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.హౌస్ లో ఈమె ప్రతి ఒక్కరిని తన ఆట తీరు కోసం బీభత్సంగా ఉపయోగించుకుంటూ ముందుకు సాగుతున్నారు.
ఇలాంటి కంటెస్టెంట్ హౌస్ లో ఉంటే ప్రమాదమే అని గ్రహించినటువంటి బిగ్ బాస్ ఈమెను బయటికి పంపించాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.

ఇలా టేస్టీ తేజకు తక్కువ ఓట్లు వచ్చినప్పటికీ కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని బిగ్ బాస్ ఈ వారం రతికను ఎలిమినేట్ చేశారని తెలుస్తోంది.అయితే రతిక హౌస్ లో గ్లామర్ డాల్ గా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.ఈమె ఎలిమినేట్ కావడంతో నేటిజన్స్ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదే నిజమైతే చాలా బాగుంటుంది అంటూ కొందరు కామెంట్లు చేయగా ఏదో వరల్డ్ కప్ గెలిచినంత సంతోషంగా ఉంది అంటూ మరికొందరు ఈ విషయంపై కామెంట్లు చేస్తున్నారు.రతిక హౌస్ లో ఉండకూడదని ఇంత మంది కోరుకుంటున్నారా అని తాజాగా ఈమె ఎలిమినేషన్ గురించి వస్తున్నటువంటి వార్తలపై నేటిజన్స్ కామెంట్స్ చూస్తేనే అర్థమవుతుంది.
మరి నిజంగానే రతికను ఈ వారం హౌస్ నుంచి బయటకు పంపిస్తారా లేకపోతే సీక్రెట్ రూమ్లో పంపించి బిగ్ బాస్ మరొక షాక్ ఇస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.