నేను పెళ్లి చేసుకోక పోవడానికి ఆ యుద్దమే కారణమంటున్న రతన్ టాటా...  

ratan tata reveals his marriage mystery - Telugu Ratan Tata, Ratan Tata Life News, Ratan Tata Love News, Ratan Tata Love Story, Tata Group Of Company\\'s, Valentine Day Special Ratan Tata Love Story

దేశంలోని సంపన్నుల లిస్టులో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకొని దేశీయ సంస్థ అయినటువంటి టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ను దేశవిదేశాలకు వ్యాపింపజేసి భారతదేశ ఖ్యాతిని మరింత పెంచినటువంటి రతన్ టాటా గురించి తెలియని వారు ఉండరు.అయితే తాజాగా రతన్ టాటా తన జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల గురించి సోషల్ మీడియా మాధ్యమం అయినటువంటి  పేస్ బుక్ ఖాతా ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు.

Ratan Tata Reveals His Marriage Mystery

ఇందులో భాగంగా తాను పెళ్లి ఎందుకు చేసుకోలేదో మరియు అందుకు గల కారణాలు ఏంటో తెలిపారు.తన 10వ ఏట తన తల్లిదండ్రులు విడాకులు తీసుకుని విడిపోయారని అప్పటి నుంచి తన ఇద్దరు అన్నదమ్ముల బాధ్యతలను తన నాయనమ్మ చూసుకునేదని చెప్పుకొచ్చాడు.

అయితే తాను లండన్ లో చదువుకున్నానని ఆ తర్వాత లాస్ ఏంజలెస్ నగరం లో ఉన్నటువంటి ఓ కంపెనీలో ఉద్యోగిగా రెండేళ్ళు పని చేశారని అన్నారు.అయితే ఆ సమయంలో అక్కడే పని చేస్తున్నటువంటి ఓ యువతితో ప్రేమలో పడ్డానని ఈ ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు కూడా వెళ్ళిందని అన్నారు.

అయితే అదే సమయంలో తన నాయనమ్మ ఆరోగ్య పరిస్థితి బాగాలేక పోవడంతో ఆమెని చూడాలని భారతదేశానికి వచ్చానని అంతేకాక తమ ప్రేమ వ్యవహారాన్ని కూడా తమ తల్లిదండ్రులతో చెప్పానని అన్నారు.అయితే ఈ వ్యవహారాలన్నీ జరుగుతున్న సమయంలో ఇండో చైనా మధ్య పెద్ద యుద్ధం జరుగుతోందని అందువలన తమ పెద్దలు ప్రేమ పెళ్లికి అంగీకరించలేదని ఆ విధంగా తాను ప్రేమించిన అటువంటి యువతికి దూరమయ్యానని అన్నారు.

#Ratan Tata

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ratan Tata Reveals His Marriage Mystery Related Telugu News,Photos/Pics,Images..