తెరపైకి రతన్ టాటా బయోపిక్... టైటిల్ రోల్ కోసం విలక్షణ నటుడు  

ఈ మధ్యకాలంలో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై బయోపిక్ కథల ట్రెండ్ నడుస్తుంది.చాలా మంది దర్శక, నిర్మాతలు ప్రముఖల జీవిత కథలని తెరపై ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్నారు.

TeluguStop.com - Ratan Tata Biopic Plan In Bollywood

ఫెయిల్యూర్స్ నుంచి సక్సెస్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన కథ ఉంటుంది.అందులో ఎన్నో భావోద్వేగాలు ఉంటాయి.

అలాంటి భావోద్వేగాలని తెరపై ఆవిష్కరిస్తే అంతే అద్భుతంగా ఉంటాయని దర్శకులు అనుకుంటున్నారు.అందుకోసమే రియలిస్టిక్ కథలు, బయోపిక్ స్టోరీస్ పై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు.

TeluguStop.com - తెరపైకి రతన్ టాటా బయోపిక్… టైటిల్ రోల్ కోసం విలక్షణ నటుడు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇక నటులకి కూడా నిజ జీవిత పాత్రలలో నటించడం అనేది కాస్తా చాలెంజింగ్ కాబట్టి అలాంటి రోల్స్ చేయడానికి వారు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.రీసెంట్ గా దక్కన్ ఎయిర్ లైన్స్ అధినేత కెప్టెన్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా ఆకాశం నీ హద్దురా అనే సినిమా వచ్చింది.

ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.

ఇప్పుడు మరో బయోపిక్ కి రంగం సిద్ధం అవుతుంది.భారతీయ కార్పొరేట్ దిగ్గజం రతన్ టాటా జీవిత కథ ఆధారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.రతన్ టాటా పాత్రల్లో ప్రముఖ తమిళ నటుడు మాధవన్ ను నటింపజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది.

ఇండియాలో విలక్షణ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న మాధవన్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా బయోపిక్ కథలపై శ్రద్ధ చూపిస్తున్నాడు.ఈ నేపధ్యంలో రతన్ టాటా పాత్ర కోసం ఆయనని కన్ఫర్మ్ చేశారని తెలుస్తుంది.

వ్యాపార పరంగా ఎన్నో విజయాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన రతన్ టాటా బయోపిక్ చేపట్టనుండటం టాటా పాత్రకు మాధవన్ ను తీసుకునేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తుండడంతో ఈ ప్రాజెక్టు పై ఆసక్తి రేకెత్తిస్తోంది.త్వరలో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

.

#Biopic Trend #Madhavan #Pan India Movie

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు