ఎలుకైతే తక్కువా... పిల్ల జోలికొచ్చిందని పామునే వణికించింది...

జంతువులు స్వయంగా వేటాడుకుని తినేవి కొన్ని ఉంటాయి.అటువంటి వాటికి జంతువులు కనిపించినా, లేదా మనుషులు కనిపించినా వేటాడుతూ ఉంటాయి.

 Rat Trembled The Snake Coming To Her Babies Details, Rat Fighting, Viral Video,-TeluguStop.com

పులులు, సింహాలు తదితర క్రూర జంతువులైతే మనుషులను కూడా చంపుకు తింటాయి.కాబట్టే వాటికి కనబడేందుకు మానవులు జంకుతుంటారు.

కానీ పాములు మనుషులను కాటు వేస్తాయి.కానీ వేటాడి చంపవు.

పాము కాటుకు విరుగుడు ఉండడంతో మనుషులు హమ్మయ్యా.అని ఊపిరి పీల్చుకుంటున్నారు.

కానీ అదే పాములు ఎలుకలు, కప్పలు వంటి జంతువులను వేటాడి తింటూ ఉంటాయి.ఇలా ఎలుకను పాము తినేందుకు తన నోట కరుచుకుని తన స్థావరం వద్దకు తీసుకెళ్దామని యోచించింది.

కానీ వెంటనే అక్కడున్న ఆ ఎలుక పిల్ల తల్లి యాక్టివ్ అయింది.పాము తనను కూడా చంపుతుందని తెలిసినా కానీ పాముతో ప్రాణాలకు తెగించి కొట్లాడింది.

తల్లి ప్రేమ. ఈ ప్రపంచంలో ఉన్న ప్రేమలన్ని కంటే తల్లి ప్రేమ చాలా గొప్పదని అనేక గ్రంథాలు చెబుతున్నాయి.తల్లిని బాధపెట్టకూడదని కూడా ఘోషిస్తున్నాయి.అయినా కానీ కొంత మంది మాత్రం తల్లల మనసులను ఇబ్బంది పెడుతూనే ఉంటారు.

అదే వేరే విషయం అనుకోండి.తన పిల్లలు ఎలా ఉన్నా కానీ తల్లి వారిని అసహ్యించుకోదు.

తన పిల్లల మీద దాడి చేస్తే అది ఎంత పెద్ద జంతువైనా, లేక మనిషైనా సరే తల్లి విడిచిపెట్టదు.

అలాంటిదే ఓ ఘటన సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

తన పిల్లను వేటాడి తీసుకెళ్తున్న ఓ పామును తల్లి ఎలుక పోరాడి పోరాడి బెదరగొట్టింది.ఇందుకు సంబంధించిన వీడియో రచ్చ రచ్చ చేస్తుంది.మీరు కూడా ఈ వైరల్ వీడియోను వెంటనే చూసేయండి.ఎలా అనిపించిందో వెంటనే కామెంట్ చేయండి.

ఇది చూసిన నెటిజన్లు చాలా మంది ఎలుక తెగువను మెచ్చుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube